పార్వతి దేవి పరమ శివుడిని వివాహమాడేందుకు ఏంచేసింది? శివకళ్యాణం ఎలా జరిగింది?

     Written by : smtv Desk | Wed, Mar 06, 2024, 07:26 AM

పార్వతి  దేవి పరమ శివుడిని వివాహమాడేందుకు ఏంచేసింది? శివకళ్యాణం ఎలా జరిగింది?

శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు" అనే విషయం అందరికి తెలిసిందే. ఇది ఏనాటి నుండో అమలులో ఉన్న నిత్య సత్యం. బోల్లా శంకరుడు అడిగిన వెంటనే కోరికలు తీర్చే పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడo అంటే అంత సులభమైన విషయం కాదు ,దాని కోసం అమ్మల కన్న అమ్మ పార్వతి దేవి ఎన్నో పూజలు చేసేది. పురాణాల ప్రకారం పార్వతి దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడానికి ఓక కథ అమలులో ఉంది , దాని గురించి తెలుసుకుందాము

కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు. కైలాసానికి సమీపంలో పర్వత రాజు హిమవంతుడు, అతని భార్య మేనకా నివాసం ఉండేవారు. వారి కుమార్తె పార్వతీ దేవి. పార్వతీ దేవి నిత్యం శివుడిని ఆరాదించేది, శివుడిని వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో ఉండేది. ఒకరోజు నారద మహర్షి పార్వతీ దేవి అభీష్టాన్ని హిమవంతుడికి వివరిస్తాడు. అపుడు హిమవంతుడు పార్వతీ దేవిని శివుడి పూజకు పంపుతాడు. ధ్యానంలో ఉన్న శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీ దేవి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది.

ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేశాడు . అతని ఆగడాలకు అంతులేకుండా పోయింది.దేవతలందరు అలోచించి బ్రహ్మ దేవుడిని ఆశ్రయిస్తారు. బ్రహ్మ దేవుడు తన దృష్టితో చూసి తారకాసురుని అంతం శివుడికి జన్మించే కుమారుని చేతిలో ఉందని తెలుసుకుంటాడు , ఇదే అనువుగా ఆలోచించి బ్రహ్మదేవుడు శివ పార్వతుల వివాహం చేయాలనీ తలంచి, మన్మదుడిని పిలిపిస్తాడు.జరిగిన విషయo మన్మధుడికి చేపి ఎలాగైన శివ పార్వతుల వివాహం జరిపించాలి అని అంటాడు.
దీని కోసం మన్మధుడు అతని భార్య రతీదేవి కలిసి శివుని తపస్సును భంగం చేయటానికి వెళతారు.అప్పుడు మన్మధుడు బాణాలను శివుడిపై విసరగా, తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపంతో మూడవ కన్ను తెరవగా, మన్మధుడు భస్మం చెందాడు.


ఇదంతా గమనించిన పార్వతీ దేవి శివుడిని కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడినుండి బయలుదేరి, తాను శివుడి ప్రసన్నం కోసం తపస్సు చేయటం ప్రారంభించింది.

పార్వతీ దేవి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వచ్చాడు. అతను పార్వతితో శివుడు మోసగాడనీ, అతన్ని నమ్మవద్దనీ చెపుతాడు. శివుడికి పరమ భక్తురాలైన పార్వతీ దేవి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు ముని శివుడిగా మారి తన నిజ రూపాన్ని చూపించి ని భక్తికి మెచ్చానని, తనను వివాహం చేసుకుంటానని చెపుతాడు.ఆ సమయంలో దేవతలందరు సంతోషించి ,
సకల దేవతలా సమక్షంలో అంగ రంగ వైభవంగా శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఈ సందర్భంగానే భూలోకంలో కూడా ప్రజలు అందరూ "మహా శివరాత్రి" ని జరుపుకుంటారు , దేని కారణంగానే మహా శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు .
శివరాత్రి రోజు చేయవలసిన దీక్ష విధానం :


శివుడిని బోళాశంకరుడు అంటారు, అంటే భక్తులను తొందరగా కరుణించి వారిని ఆదుకునే దైవంగా శివుడు ప్రసిద్ధి చెందాడు.శివుడు అభిషేక ప్రియుడు అంటే ఒక చెంబు నీళ్లు పోస్తేనే కరుణించే దేవం,అందుకే అందరికి శివుడు ఇష్టదైవంగా నిలిచాడు . శివరాత్రిని చాలామంది భక్తులకు ఇష్టమైన పండుగగా జరుపుకుంటారు .

మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. "రా" అన్నది దానార్థక ధాతు నుండి "రాత్రి" అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద - రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది - హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక అని అర్థo

"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.అంతే కాకుండా మారేడు దళాలపై దీపపు దిమ్మెలను ఉంచి, ఆవునెయ్యితో దీపాలను వెలిగించాలి. శివరాత్రి నాడు వెలిగించే దీపాలలో 3 వత్తులను వేయాలి. శివలింగానికి పానమట్టం ఉన్న వైపు దీపాలు వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుందనీ, పానమట్టానికి అవతలి వైపు దీపాలు వెలిగిస్తే వైరాగ్యం కలుగుతుందనీ నమ్మకం,మారేడు దళంమే కాకుండా తెల్లపూల మాలతో భోళాశంకరుడిని అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని నమ్మకం , పూజనే కాకుండా ఈరోజు ఉపవాస దీక్ష నిర్వహించవలసి ఉంటుంది.

ఉపవాస దీక్ష మరియు జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు. ఉపవాసం అనగా కేవలం ఒంటిపూట భోజనం మాత్రమే కాదు, భూషణం, సాత్విక ఆహారం తీసుకోవటం, శారీరక మానసిక శౌచలం కలిగి ఉండటం వంటివి ఉండాలి. ప్రదోష వేళ అనగా సూర్యాస్తమయం, చంద్రోదయానికి మధ్య కాలం నుండి శివుడికి అభిషేకం, పూజలు ,అర్ధరాత్రి లింగోద్బవ సమయం వరకూ అభిషేకాలు చేస్తూ ఉండాలి.
రాత్రి జాగరణ తరువాత మరుసటిరోజు పూజలు నిర్వహించి, శివుడికి నైవేద్యాలు సమర్పించి, తాము స్వీకరించి ఉపవాస దీక్షను విరమిస్తారు.





Untitled Document
Advertisements