శివుడిని రకరకాల పేర్లతో పిలవడం వెనుక కారణం ఇదేనట!

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 07:59 AM

శివుడిని రకరకాల పేర్లతో పిలవడం వెనుక కారణం ఇదేనట!

లయకారకుడైన పరమశివుడు సాంప్రదాయ నిబంధనలను విచ్ఛిన్నం చేస్తూ వెలసిన దేవదేవుడిగా 'శివ భగవానుడికి' పేరు వచ్చింది. స్మశాన వాటిక నుండి బూడిదను మరియు పులి చర్మాన్ని తన శరీరంపై చల్లుకొని , మరొక పక్క పుఱ్ఱెలతో తయారుచేసిన దండ ను అలంకరించుకోవడంలోనూ, స్మశానవాడిగా పేరు తెచ్చుకొని అంతేకాకుండా అతనికి తోడుగా - అతని మెడను పట్టుకొని ఉన్నట్లుగా ఒక పాము చుట్టుకొని ఉంటుంది. మరియు మనిషిలా నృత్యం చెయ్యగలిగే సామర్ధ్యము కూడా అతనికి కలవు. అతనిని అతనిలా నమ్మి ఆరాధించే వ్యక్తుల యొక్క భక్తి భావాన్ని మాత్రమే చూస్తాడు తప్ప, అతని కులాన్ని,ఏ మతాన్ని మాత్రం చూడడు నృత్యానికి అధిపతిగా శివుడిని "నటరాజు" అని కూడా పిలుస్తారు, శివుడు ఒక అద్భుతమైన నర్తకుడుగా కూడా మంచి గుర్తింపును పొందాడు. అతని కుడి చేతిలో ఉన్న డమరు - సృష్టిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది మరియు అతని నృత్యం - విశ్వం యొక్క వినాశనమును సూచిస్తుంది. దీనిని శివ
'తాండవమని' అంటారు. బ్రహ్మ, తిరిగి ప్రకృతిని సృష్టించే సమయమును ఇది సూచిస్తుంది.అంతే కాకుండా శివుడికి నీలకంఠుడు అని పేరు కూడా ఉంది .

దీనికి ఒక పురాణ కదా కూడ అమలులో ఉంది . హిందూ పురాణాలలో బాగా ప్రసిద్ధి చెందిన కథలలో సముద్ర-మథనం ఒకటి. ఇందులో దేవతలు మరియు అసురులు ఒక కూటమిగా ఏర్పడి అమరత్వమును సిద్ధింపజేసే అమృతాన్ని పొందటం కోసం సముద్రాన్ని చిలుకుతారు. అయితే ఇక్కడ చిలుకుటకు మండరా అనే పర్వతాన్ని ప్రధానమైన స్తంభంగా చేసుకొని, వాసుకి అంటే (శివుడు ధరించే పాము) ను చిలికేందుకు తాడుగా ఉపయోగించబడ్డాయి. మొత్తం సముద్రాన్నే చిలికినందువల్ల ఘోరమైన ఫలితాలకు దారితీసింది. ఈ పరిణామాలలో హాలాహలం బయటకు విరజిమ్మి, మొత్తం విశ్వాన్నే విషపూరితం చేసింది. ఆ సమయంలో శివభగవానుడు ఆ విషయాన్ని త్రాగుతాడు, అలా ఆ విషం శివుని శరీరం మొత్తం వ్యాపించకుండా పార్వతీదేవి తన చేతులతో శివుని యొక్క గొంతును పట్టుకొని ఉంటుంది. అలా చేయడం వలన శివుని గొంతు నీలి రంగులోకి మారడం జరుగుతుంది . దీనివలన అతనిని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ నీలకంఠుడి అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాలైన మంత్రాలు ఉన్నాయి .వాటి అన్నింటిలో ముఖ్య మైనది .

మహామృత్యుంజయ మంత్రం : "ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్"
మహామృత్యుంజయ మంత్రం శివుని అనుగ్రహం పొందడానికి, మరణ భయాన్ని తొలగించడానికి జపించాలని హిందూ జ్యోతిష్యశాస్త్రంలో నమ్మకం. మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం..

మహా మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం : "జ్ఞాన దర్శనం కలిగిన మూడు కన్నుల భగవంతుడు (శివుడు) మనలో ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రపంచం నుండి మమ్మల్ని విముక్తి చేస్తాడు. మృత్యువు బంధాల నుండి విముక్తి పొందుతాం అని అర్థం .

శివుడు కోరుకున్న కోరికలను త్వరగా తీర్చగలడని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ పురాణం, శివపురాణం ప్రకారం, శివుడికి మరణాన్ని కూడా తొలగించే శక్తి ఉంది. ఏ వ్యక్తి అయినా జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అలాంటి వారు శివుని మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.ఎవరైతే ఏ మహాశివరాత్రి రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించి శివునికి అభిషేకం చేసినా ఆ శివుని అనుగ్రహం వలన మృత్యువుతో కలిగే ఆపదలు తొలగిపోతాయని తెలుస్తుంది .





Untitled Document
Advertisements