మహిళలకు స్ఫూర్తిదాయకమైన తెలంగాణ యువతి సిరి కొండా సోనా స్టోరీ

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 08:54 AM

మహిళలకు స్ఫూర్తిదాయకమైన తెలంగాణ యువతి సిరి కొండా సోనా స్టోరీ

స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ,లేకపోతే మరణం లేదు, స్త్రీ లేకపోతే సృష్టియే లేదు ,ఇలాంటి స్త్రీ ఎన్నో విషయాల్లో ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెడుతున్నది . ఇలాంటి మహిళల కోసం మార్చి నెలను మహిళ మాసంగా పాటిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చి 8 జరుపుకుంటున్నారు. ఎన్నో దేశాల్లో, అన్ని ప్రధాన ప్రాంతాలలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలను జరుపుతు న్నారు. అలాగే మహిళలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి పలు కార్యక్రమలను నిర్వహిస్తున్నారు అంతే కాకుండా వారి పేరిట ఎన్నోపరిశ్రమలను స్థాపించి వారికి ప్రోత్సహాన్ని కల్పిస్తున్నారు . ప్రస్తుతం మహిళలు అన్నీ రంగాలలో అడుగులు ముందుకు వేస్తూ తమ చట్ట చాటుతున్నారు .
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక గృహినిగా ఇంటి బాధ్యతను చూసుకుంటూ ఏదైనా సాధించాలనే తపనతో, ఒక ప్రభుత్వ ఉద్యోగము సంపాదించడం చాలా గొప్ప అనుకుంటే ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఈ చిన్నది . మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మన ఈ తెలంగాణలో అదిలాబాద్ జిల్ల బైంసాకు చెందిన సిరికొండ సోనా సక్సెస్ టోర్నీ తెలుసుకుందాము

సిరికొండ సోనా ఒకటి నుండి 10వ తరగతి వరకు నిర్మల్ లోని సరస్వతి శిశుమందిరం లో చదివింది. ఇంటర్ నిర్మల్ లోనే పూర్తి చేసింది 2010లో వానల్పాడు గ్రామానికి చెందిన సిరికొండ గాంధీతో వివాహం జరిగింది ఆ తర్వాత గాంధీ తన భార్యపట్టుదలను చూసి నిర్మలో డిగ్రీ ,పేజీ చదివించాడు. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్ల అప్లై చేయించి ప్రోత్సహించాడు. ఒకసారి టీజీటీ ,పీజీటీ జూనియర్ లెక్చర్ పోస్టులకు అప్లై చేసుకొన్నది అంటే ఒకేసారి మూడు ప్రభుత్వ కొలవులను సాధించి సిరికొండ సోనా అందరి మన్ననలు పొందుతుంది . ఈ మే గృహని గా పిల్లల చదివిస్తూ తాను చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమై అన్ని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది
ఇలా మహిళలు కష్టపడి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలుస్తుంది ఇంతకుముందు కాలంలో మహిళలు వంటింటికే పరిమితమై ఉండేలా, కాకుండా విషయాలలో ముందుడి తన కాళ్ళ మీద తాను నిలబడి ఎన్నో విషయాలలో విజయాలను సాధిస్తూన్నారు
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. అటువంటి మహిళలను గుర్తిస్తూ జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికి స్ఫూర్తినివ్వాలి. మరెందరో మహిళలు సోనాను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని smtv మనస్పూర్తిగా కోరుకుంటుంది.





Untitled Document
Advertisements