గోర్లు తీసుకునే సమయంలో ఈ తప్పులు చేస్తే అంతే.. లక్ష్మిదేవి ఆగ్రహానికి గురవక తప్పదట!

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 08:59 AM

గోర్లు తీసుకునే సమయంలో ఈ తప్పులు చేస్తే అంతే.. లక్ష్మిదేవి ఆగ్రహానికి గురవక తప్పదట!

చాలామంది నోట్లో వేలు పెట్టుకుని గోర్లను కొరుకుతూ ఉంటారు. దీని వలన గోర్లల్లో ఉన్నటువంటి మురికి కడుపులోకి పోయి చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుంది . ఇలా నోట్లో వేలు పెట్టుకుని గోర్లు కొరుకుకోవడం మంచి అలవాటు కాదు, ఇలాచేయకుండా మనకి ఎప్పటికప్పుడు పెరిగినటువంటి గోర్లను కత్తిరించుకోవాలి . ఈగోర్లను కత్తిరించుకునే విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి
సాధారణంగా పెద్దలు రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దని చెప్పడం మీరు గమనించి ఉండవచ్చు. దీనికి జ్యోతిష్య మరియు వైద్యపరమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు రాత్రిపూట మీ గోళ్లను ఎందుకు కత్తిరించకూడదో తెలుసుకుందాం.
మన పెద్దలు ఊరికే ఏమీ అనరు. ఒక్కొక దాని వెనుక ఒక్కో కారణం ఉంటుంది. పెద్దల మాట చందన్న మూట అంటారు కదా ,అందుకే
సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కత్తిరించకూడదని కూడా చెబుతున్నారు. కానీ నేటి కాలానుగుణ ప్రపంచంలో రాత్రిపూట వచ్చి గోళ్లు కోసుకుంటున్నారు. ఈ సమయంలో లక్ష్మి దేవి ఇంటికి రావడాన్ని చూస్తుంది . కావున లక్ష్మి ఐశ్వర్యానికి, సంపదకు ప్రతీక కాబట్టి సాయంత్రం లక్ష్మి రాగానే తలుపులు తెరిచి ఉంచాలని పెద్దలు చెబుతారు
లక్ష్మి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో గోర్లను తీయడం సరి కాదు అంతే కాకుండ చెత్త వేయడం సరికాదు..దీనివలన పెద్ద సమస్య అవుతుంది . లక్ష్మికి మీపై కోపం వస్తుంది.మీ ఇంటిని వదిలి వెళ్లి పోతుంది దీంతో ఆర్థిక సమస్య పెరుగుతుంది. పేదరికం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది.

ఆధునిక కాలంలో కూడా చాలా మందిలో మంత్రవిద్య , మంత్రాల భయం ఉంది. దీన్ని చేయడానికి ప్రజల జుట్టు, గోర్లు లేదా బట్టలు ఉపయోగిస్తారు. కాబట్టి రాత్రిపూట గోళ్లు కోసినప్పుడు ముక్కలు కింద పడి కనిపించకుంటే ఇబ్బందులు కూడా వస్తాయని పెద్దల విశ్వాసం.ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఎవరు కూడా గోర్లను సూర్యాస్తమయం సమయంలో కత్తిరించకుండా వారానికి ఒకసారి మన సెలువు రోజు అయినా ఆదివారం నాడు తీసుకోవాలి కదా మరి .





Untitled Document
Advertisements