డాక్టర్లకు, టీచర్లకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కొట్లలో సంపాదించుకోవచ్చు!

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 06:38 PM

డాక్టర్లకు, టీచర్లకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కొట్లలో సంపాదించుకోవచ్చు!

సంవత్సరానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి పైనే సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలి అనుకోరు. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని కలలు కంటారు. అందుకు స్కాట్లాండ్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. స్కాట్లాండ్ పరిధిలో కొన్ని చిన్న దీవులు ఉన్నాయి. వీటిలో డాక్టర్లుగా, టీచర్లుగా పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని స్కాట్లాండ్ ప్రకటన చేసింది. డాక్టర్లకు ఏడాదికి రూ.1.57 కోట్లు ఇస్తామని ప్రకటించింది. టీచర్లకైతే ఏడాదికి రూ.71.47 లక్షల వరకు ఇస్తారట.
స్కాట్లాండ్ కు చెందిన హెబ్రెడీస్ దీవుల సమాహారంలోని యూవీస్ట్, బెన్ బెక్యులా తదితర 6 దీవుల్లో డాక్టర్ల కొరత అధికంగా ఉంది. కాగా, ఇక్కడికి వచ్చే డాక్టర్లు 6 దీవుల్లోని 4,700 మంది వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.
ఇక్కడికి సమీపంలోని రమ్ ఐలాండ్ లో టీచర్ల కొరత ఉంది. రమ్ దీవిలోని కిన్లోచ్ అనే గ్రామ జనాభా కేవలం 40 మంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 5.
ఈ దీవుల్లో నివసించే జనాభా చాలా తక్కువే అయినప్పటికీ, వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే, ఇవి మారుమూల దీవులు కావడంతో ఇక్కడ పనిచేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. అందుకే సాధారణ వేతనాల కంటే 40 శాతం అధిక వేతనాలు ఇచ్చేందుకు స్కాటిష్ ప్రభుత్వం సిద్ధమైంది.
అంతేకాదు, డాక్టర్లు, టీచర్ల జీవిత భాగస్వాములకు కూడా ఈ దీవుల్లోనే ఉపాధి కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తాము ఉన్న చోటి నుంచి ఈ దీవులకు వచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దాంతో పాటే, వీరిని ఈ దీవులకు స్వాగతించే క్రమంలో 'గోల్డెన్ హలో' పేరిట రూ.9 లక్షల ప్రోత్సాహక నగదు కూడా అందిస్తారు. నిజంగానే ఇది కళ్ళు చెదిరే ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఆలస్యం ఎందుకు మరి మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటె వెంటనే ఈ విషయం వారికి చెప్పండి.





Untitled Document
Advertisements