మీ మాడుని బట్టి జుట్టుకు రాసే నూనే ఎంచుకొండిలా!

     Written by : smtv Desk | Fri, Mar 08, 2024, 10:19 AM

మీ మాడుని బట్టి జుట్టుకు రాసే నూనే ఎంచుకొండిలా!

ఆడవారి అందం వారి కురులలో ఉంటుంది . ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా హెయిర్ లీవ్ చేసుకోవడం ఫ్యాషన్ గా, చూడడానికి చాల బాగుంటుంది . డైలీ హెడ్ బాత్ చేయడం చేస్తూవుంటారు అలాంటి అప్పుడు జుట్టు బలంగా ఉండాలి కదా అందుకే హెయిర్ కేర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా జుట్టుకు ఎదో ఒక రకమైన నూనె రాయడం మర్చిపోవద్దు. అయితే స్కాల్ప్ (మాడు) రకాన్ని బట్టి నూనెలను ఎంచుకోవాలి. తలకు పట్టించే నూనెల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు

మాడు జిడ్డుగా ఉన్నవారు జుట్టుకు తేలికపాటి నూనెలు అప్లై చేసుకోవాలి.సేబాషియస్ గ్రంధులు అధిక స్రవాలను విడుదల చేయని హెయిర్ ఆయిల్ వాడాలి వీరికి గ్రేప్ సీడ్ ఆయిల్, జొజోబా ఆయిల్ వంటివి బెస్ట్ ఆప్షన్లు. ఇవి జుట్టును బరువుగా మార్చవు, మరింత జిడ్డును ఉత్పత్తి చేయవు. పొడి స్కాల్ప్స్ ఉన్నవారు కొబ్బరి లేదా బాదం వంటి హెవీ ఆయిల్స్ తలకు పట్టించవచ్చు. వీటితో మాడును సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇవి మాడు, జుట్టుకు తేమను అందించి, శిరోజాలను బలంగా మారుస్తాయి. నార్మల్ స్కాల్ప్ ఉన్నవారు అర్గాన్ లేదా ఆలివ్ ఆయిల్ నూనెలను ఉపయోగించవచ్చు.
సెన్సిటివ్ స్కాల్ప్ (Sensitive Scalp) ఉన్నవారు స్వీట్ ఆల్మండ్ లేదా అవకాడో వంటి సున్నితమైన నూనెలను జుట్టుకు పట్టించాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ నూనెలను అప్లై చేసుకోవచ్చు.
సాధారణ తల చర్మం (Normal Scalp) ఉన్నవారు బ్యాలెన్స్ డ్ హైడ్రేషన్ అందించే బాదం లేదా అర్గాన్ (argan) వంటి నూనెలను వాడొచ్చు. మాడు, వెంట్రుకలను పూర్తిగా కవర్ చేసేలా నూనె రాయాలి.

చాల మందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు . తలకు ఎక్కువ సార్లు నూనె అప్లై చేస్తే, తల చర్మంపై సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలకు అంతరాయం కలుగుతుంది . స్కాల్ప్ సహజ సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టుకు నూనె రాసుకోవాలని . ఈ విషయంలో మాడు రకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ విధంగా మన కురులకు సరిపోయే ఆయిల్ ఎంచుకొని అప్లై చేసుకొని ఎంతో అందంగా చూసుకోవాలి





Untitled Document
Advertisements