మహాశివరాత్రి కటిక ఉపవాసం చేయలేని వారు ఏరకమైన ఆహారాలు తినవచ్చు..

     Written by : smtv Desk | Fri, Mar 08, 2024, 10:31 AM

మహాశివరాత్రి కటిక ఉపవాసం చేయలేని వారు ఏరకమైన ఆహారాలు తినవచ్చు..

హిందువులందరూ జరుపుకునే పండుగలో మహా శివరాత్రి అత్యంత ప్రత్యేకమైనది. ఇది తెలుగు సంవత్సరంలో వచ్చే చివరి పండుగ మహా శివరాత్రి అంటే పరమశివుని పరమ పవిత్రమైన రాత్రి. భక్తులు మహా శివరాత్రి నాడు ఉపవాసం , రాత్రంతా జాగారం చేసి శివునికి పూజలు చేస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఆ మహా శివుని ఆశీర్వాదం కోసం శక్తి మేరకు ఉపవాసం ఉంటారు.శివుని పట్ల తమకున్న భక్తి, ఆరాధనను తెలియజేసేందుకు మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం వంటివి చేస్తుంటారు. శివుడి కొరకు ఉపవాసదీక్షలో ఉండి దీక్ష విరమించే సమయంలో ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం..
మహా శివరాత్రి నాడు బంగాళదుంపకు సంబంధించిన ఏదైనా ఆహారాన్ని తినవచ్చు. కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటివి ఆ ఆహారపదార్థాల్లో చేర్చకూడదు. బంగాళదుంపలను మెత్తగా చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆలూ టిక్కీ లేదా ఆలూ పకోడా లేదా ఆలూ ఖిచ్డీ లేదా పంచదార కలిపి తినవచ్చు.

దీనితోపాటు చిలగడ దుంపలను కూడా ఉడికించి తినవచ్చు. స్వీట్ పొటాటోను తినడం వలన మీకు శక్తి వస్తుంది. ఎక్కువ నీరసం అవ్వరు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా చిలగడ దుంపలను ఉడికించి తింటారు

పిల్లలు, రోగులు, వృద్ధులు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. అంటే మహా శివరాత్రి నాడు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. చాలా మంది ఈ కఠినమైన ఉపవాసాన్ని పాటించలేరు. కానీ అదే సమయంలో తక్కువ మొత్తంలో పండ్లు, పాలు, కూరగాయలు లేదా ధాన్యం కాని ఆహారాలు తీసుకుంటారు. మీరు ఈ సంవత్సరం మహా శివరాత్రి ఉపవాసం ఉంటే ఈ కింది ఆహారాలను తీసుకోవచ్చు.

మహా శివరాత్రి వ్రతం సమయంలో ధాన్యం కాని ఆహారాలు తినవచ్చు. గోధుమలు, సాబుదానాలాంటి ఆహారాలు తినడానికి అనుమతి ఉంది. పాలు శివునికి ఇష్టమైనవిగా చెబుతారు. భక్తులు శివలింగంపై పాలు పోసి పూజలు చేస్తారు. మహా శివరాత్రి పర్వదినాల్లో భక్తులు పాలు తాగుతారు. ఈ ఉపవాస సమయంలో ముఖ్యంగా పాలు, పాలతో కూడిన పానీయాలు తీసుకోవచ్చు. బాదం పాలు, సేమియాలాంటివి చేసుకుని తీసుకోవచ్చు.

కఠిన ఉపవాసం పాటించలేని భక్తులు పండ్లు, పాలు, నీరు కలిపిన తీసుకోవచ్చు. సాధారణంగా మహా శివరాత్రితో సహా అన్ని పూజలు, ఉపవాసాలలో పండ్లకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ ఫ్రూట్ షేక్స్ వంటివి శివరాతి ఉపవాసంలో తినవచ్చు. పండ్లతో పాటు రకరకాల డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు. మీరు బాదం, వాల్ నట్ లు, ఖర్జూరం, పప్పులు, ఎండుద్రాక్ష తినవచ్చు.

చిరుతిళ్ల విషయానికొస్తే మహా శివరాత్రి వ్రతంలో అరటి వడ తీసుకోవచ్చు. కానీ ఉపవాస సమయంలో అనుమతిలేని మసాలా దినుసులతో చేసిన ఆహారాలను తీసుకోకూడదు. మసాలా దినుసుల విషయానికొస్తే జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి ఏలకులు, దాల్చిన చెక్క, ఓమమ్ మొదలైన మిశ్రమ ఆహారాలను తినవచ్చు. ఈ విధంగా మనకు వీలైన విధంగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపవాస దీక్ష చేసి ఆ పరమశివుడి ఆశీర్వాదం పొందవచ్చు.





Untitled Document
Advertisements