బీట్ రూట్ తో పెదాలను ఇలా చేస్తే లిప్స్టిక్ అవసరమే లేదట!

     Written by : smtv Desk | Fri, Mar 08, 2024, 10:52 AM

బీట్ రూట్ తో పెదాలను ఇలా చేస్తే లిప్స్టిక్ అవసరమే లేదట!

ముఖం ఎంతైతే అందంగా ఉంటుందో పెదవులు కూడా అంటే అందంగా ఉండాలి. పెదవులు మన ముఖంలో అత్యంత మృదువైన భాగం. ఇవి సున్నితంగా ఉంటాయి. తేమను ఉత్పత్తి చేయటానికి గ్రంధులను కలిగి లేనందున సులభంగా పొడిబారి పోతూ ఉంటాయి . చాలా మందికి నల్లటి పెదాలు ఉంటాయి,పెదావులు మీ అందాన్ని పెంచుతాయి. కానీ కొన్నిసార్లు మన అలవాట్ల వల్ల లేదా బలమైన సూర్యకాంతిలో పని చేయడం వల్ల పెదవుల గులాబీ రంగు పోతుంది

దీని కారణంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఆందోళన చెందుతుంటే.. ఈ రోజు మనం ఇంటి చిట్కాలను ఉపయోగించి మీ పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

* చక్కెర గింజల్లో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి పెదాలను స్క్రబ్ చేయండి. ఇలా ఒకటి నుంచి 2 నిమిషాల పాటు చేస్తూ 5 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారం రోజుల పాటు ప్రతిరోజూ చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా మరియు మెరుస్తూ ఉంటాయి.

* ఇంటిలో తీసిన వెన్న లేదా కాచిన నెయ్యిని పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇది సహజసిద్దమైన లిప్ బామ్ వలే పనిచేసి పెదవుల సున్నితత్వాన్ని మరియు అందాన్ని కాపాడుతుంది.

* పగిలిన పెదవులకు తేనే బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకొనే ముందు పెదవులకు తేనే రాసుకుంటే పెదవులను పగుళ్ళ నుండి రక్షించుకోవచ్చు.

* పాల మీగడను పెదవులకు అప్లై చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేయటానికి మీగడ దోహదం చేస్తుంది. అలాగే ప్రతి రోజు పెదవులకు మీగడ రాయటం వలన పెదవుల మెరుపును కాపాడుకోవచ్చు.

* టీ బ్యాగ్ లను మరిగే నీటిలో ముంచి తీసాక, చల్లారిన తర్వాత ఆ బ్యాగ్ ను పెదవులపై బలంగా రుద్దాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే పెదవుల పగుళ్ళ నుండి తప్పించుకోవచ్చు.

* మీరు మీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. అలాగే మీరు మీ ఆహారంలో టమోటాలు, క్యారెట్లు మరియు ఆకుకూరలు వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తీసుకోవాలి.

* అంతే కాకుండా బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల మీ పెదాలను అందంగా మార్చడమే కాకుండా వాటిని మృదువుగా మారుస్తాయి. అర చెంచా బీట్ రూట్ రసం, ఒక చెంచా నెయ్యి మరియు ఒక చెంచా అలోవెరా జెల్ కలిపి లిప్ మాస్క్ ను తయారు చేయండి. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేయడం వలన పెదవుల పగుళ్ళ నుండి తప్పించుకోవచ్చు.

ఈ విధంగా మన కిచెన్లో దొరికే వస్తువులను ఉపయోగించుకొని ఏ కాలంలోనైనా మన పెదవులను రక్షించుకోవచ్చును .





Untitled Document
Advertisements