గర్ల్ ఫ్రెండ్ కి మంత్రి పదవి ఇవ్వొచ్చంటే నేను కూడా గర్ల్ ఫ్రెండ్ ని తయారుచేసుకుంటా.. ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 09:42 AM

గర్ల్ ఫ్రెండ్ కి మంత్రి పదవి ఇవ్వొచ్చంటే నేను కూడా గర్ల్ ఫ్రెండ్ ని తయారుచేసుకుంటా..  ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

కొద్దిరోజులక్రితం తెలంగాణ ఎన్నికలలో ఉహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం విధితమే, నాటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో ఈసారి బీజీపీ కూడా అనుకున్నదానికన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అన్నిటికన్నా ముఖ్యంగా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డిది ఒక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత ఆయనది. అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇలాంటి ఘనతను సాధించిన నాయకుడు మన దేశ చరిత్రలో మరెవరూ ఉండకపోవచ్చేమో. తాజాగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కామారెడ్డిలో కొన్నాళ్లుగా ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఉన్నత హోదా ఇస్తున్నారని, శిలాఫలకాలపై కూడా ఆయన పేరును చేరుస్తున్నారని రమణా రెడ్డి మండిపడ్డారు. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అప్పుడు తానే సీఎం అవుతానని, తన గర్ల్ ఫ్రెండ్ కు మంత్రి పదవిని ఇస్తానని తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ కి మంత్రి పదవి ఇవ్వొచ్చు అనుకుంటే.. తాను కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ని తయారు చేసుకుంటానని చెప్పారు.

2023లో తాను ఎమ్మెల్యే అవుతానని చెప్పానని.. అలాగే ఎమ్మెల్యే అయ్యానని రమణా రెడ్డి తెలిపారు. 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, తానే సీఎం అవుతానని.. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే తన ముఖం కూడా చూపించను అన్నారు. అదే విధంగా ఇది తాను చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్ అన్నారు.





Untitled Document
Advertisements