అనంతపురం శంఖారావం సభలో జగన్ పై నిప్పులు చెరిగిన లోకేశ్..

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 12:19 PM

అనంతపురం శంఖారావం సభలో జగన్ పై నిప్పులు చెరిగిన లోకేశ్..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ పార్టీలకు చెందినా నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా ప్రత్యర్థులపై విమర్శలకు దిగుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. కొద్దిరోజుల్లో ఎన్నికల జరుతున్నాయి కాబట్టి ప్రజలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. ఈ ఐదేళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విశాఖలో కోడికత్తి టవర్ ను కట్టించాడని... రెండు కోడికత్తులు పక్కపక్కన పెట్టినట్టు ఆ టవర్ ఉంటుందని ఎద్దేవా చేశారు. అనంతపురం శంఖారావం సభలో ప్రసంగిస్తూ లోకేష్ పై విధంగా జగన్ పై విమర్శలు సంధించారు.
వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ యవతను మోసం చేశారని చెప్పారు. వంద సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో జగన్ ను ప్రజలు నిలదీయాలని అన్నారు. జగన్ సిద్ధం సభలకు జనాలు రావడం లేదని... దీంతో, గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ తో జనాలు వచ్చినట్టు చూపిస్తున్నారని సెటైర్ వేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు కోర్డినేటర్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడుతూ.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమికొట్టాలని అన్నారు. చిత్తూరు జిల్లాను పాపాల పెద్దిరెడ్డి పూర్తిగా దోచేశారని.. ఇప్పుడు అనంతపురం జిల్లాను కూడా దోచేందుకు రెడీ అవుతున్నారని చెప్పారు.
అనంతపురం జిల్లాతో తనది ప్రత్యేకమైన అనుబంధమని లోకేశ్ అన్నారు. తన తాత ఎన్టీఆర్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచారని, మామయ్య హరికృష్ణ ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారని, బాలకృష్ణ మామయ్య వరుసగా రెండు సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పారు. ఆయన మీ అందరికీ బాలయ్య అయితే.. తనకు మాత్రమే ముద్దుల మామయ్య అని అన్నారు.





Untitled Document
Advertisements