అమ్మో వేసవికాలం సెలవులలు అన్ని భయపడుతున్నారా? పిల్లల పేచీ తీర్చండిలా..

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 12:48 PM

అమ్మో వేసవికాలం సెలవులలు అన్ని భయపడుతున్నారా? పిల్లల పేచీ తీర్చండిలా..

వేసవి కాలం వచ్చింది అంటే హాలిడేస్ ని తెచ్చింది అని అర్థం . దీనితో ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లల అల్లరిని భరించలేక పోతు ఉంటారు . ఈ హాలిడేస్ ఎందుకు వచాయ్ రా బాబు అని అందరూ తలలు పట్టుకుంటారు కదా . ఇలాంటి సమయంలో అమ్మమ్మ గారి ఇంటికో, నానమ్మ గారి ఇంటికో వెళ్తే బావుంటుంది . కానీ అక్కడ బంధువుల పిల్లలు అందరూ ఉంటారు ఇంకా వాళ్లు చేసే కొట్లాటలు చేసే అల్లరిని భరించడం మన వల్ల కాదు . మాములుగా మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎప్పుడూ కొట్టుకుంట్టు ఉంటారు. వాళ్ల గొడవలు చూసి పేరెంట్స్ కూడా విసిగిపోతూ ఉంటారు. ఇద్దరికీ ఒకేలాంటి డ్రెస్, వస్తువులు తెచ్చి ఇచ్చినా కూడా ఎక్కడ గొడవ వస్తుందో తెలీదు కానీ కొట్టుకుంటూనే ఉంటారు. ఇంత మంది కలిశారు అంటే ఇంకా అంతే పిల్లలు కొట్టుకోవడం మొదలు పెడతారు .
మనకు కోపం వస్తుంది అప్ప్పుడు ఎవరినో ఒకరిని కొట్టడం, లేదంటే.ఇద్దరినీ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారు. దాని వల్ల పిల్లలకు ఒకరిపై మరొకరికి కోపం పెరిగిపోతోంది. నీ వల్లే అమ్మ నన్ను కొట్టింది. నాన్న నన్ను తిట్టాడు అని కోపం పెంచుకుంటారు. వారి మధ్య సఖ్యత కూడా తగ్గిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ముందు మీరు పిల్లల సమస్య తీర్చే ప్రయత్నం చేయాలి.
ఎందుకు గొడవ పడినారో వారిని పిలిచి మాట్లాడండి. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడండి, ఆపై వారితో కలిసి మాట్లాడండి. ప్రతి ఒక్కరినీ మాట్లాడటానికి అనుమతించండి. వారి సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించి అది వారికి నచ్చేలా వివరించాలి.
పిల్లలు వినేదాని కంటే ఎక్కువగా చూసేదాన్ని ఫాలో అవుతారు. "మీరు సానుకూల సంభాషణ శైలులను ప్రదర్శించాలి - ఇది స్నేహితులతో లేదా మీ భాగస్వామితో కావచ్చు. పిల్లలకు కలిగే విభేదాలను సానుకూలంగా ఎలా పరిష్కరించుకోవాలో లేదా ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలుసుకోవడం గొప్ప రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుంది" వారు మీరు ప్రవర్తించే తీరును బట్టే వారు కూడా తోడపుట్టిన వారితో, చుట్టు పక్కల వారితో, బంధువులతో, కూడా మీ మాదిరిగానే ఫాలో అవుతారనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి.
మీ పిల్లలు తోడబుట్టిన వారితో ప్రేమగా ఉన్నా, ఒకరికి మరొకరు సహాయం చేసుకున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే వారికి బహుమతులు లాంటివి ఇచ్చి మెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా వారు ఒకరితో మరొకరు గొడవలు పడకుండా ఉంటారు. అంతే కాకుండా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు కలిసి ఆడుకోవడం వలన కలిగే లాభాలు చెప్పండీ .మన చిన్నప్పుడు అందరూ కలసి ఎలా ఉన్నామో
వారికీ తెలియచేయాలి . మొకై వంగనిదే మానై వంగదు కదా అందుకే చిన్నప్పటి నుండే పిల్లలకు అన్ని నేర్పించాలి . ఈ విధంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలను ఎంగేజ్ చేస్తూనే వాళ్లకి మంచి, చెడుల మధ్య తేడాలు చెబుతూ ఎవరితో ఎలా మెలగాలి. సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు అర్ధం అయ్యే రీతిలో వివరించి చెప్పండి. మనం కొత్తకొత్త విషయాల గురించి చెప్పడం వలన వారి మధ్య జరిగిన పేచీల సంగతి పక్కన పెట్టి వాటి గురించి తోటి పిల్లలతో చర్చించడం మొదలు పెట్టి వారితో కలిసిపోతారు.





Untitled Document
Advertisements