అదిరిపోయిన ఇందిరమ్మ ఇంటి ప్లాను!

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 01:27 PM

అదిరిపోయిన ఇందిరమ్మ ఇంటి ప్లాను!

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా సొంత స్థలం కలిగి ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షలు సాయం చేస్తారు. అదే విధంగా ఇళ్ళు నిర్మించుకోవడానికి స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు. ఏడాది 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వం పలు నమూనాలు సిద్ధం చేసింది. ప్రతి డిజైన్‌లోనూ కిచెన్, టాయిలెట్ ఉండేలా తీర్చిదిద్దారు.
తొలి నమూనాలో సింగిల్ బెడ్రూం, కిచెన్, అటాచ్డ్ వాష్‌రూం, హాల్, కామన్ బాత్రూం, ఇంటిపైకి వెళ్లేందుకు మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత జాగా, బాల్కనీ, బైక్ పార్కింగ్ కోసం స్థలం, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లు మంజూరు చేసింది. మిగతా 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద అట్టేపెట్టింది. ఈ పథకం అమలు కోసం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో 95 వేల ఇళ్లు నిర్మించనుంది. గ్రామాల్లో 57 వేలు, పట్టణ ప్రాంతాల్లో 38 వేల ఇళ్లను నిర్మిస్తారు.





Untitled Document
Advertisements