పిల్లల్లో వస్తున్న జ్వరానికి కారణం ఇదేనట

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 11:44 AM

పిల్లల్లో వస్తున్న జ్వరానికి కారణం ఇదేనట

సాధారణంగా పిల్లలకి సీజన్ మారడం వలన ఏదో ఒక రకమైన ఫీవర్, జలుబు, , దగ్గు వస్తు ఉంటాయి . ఇవి రావడానికి వైరల్ ఇన్ఫెక్షన్లు అనుకుంటాం.కానీ కొన్ని సార్లు బ్యాక్టీరియాతో జ్వరం వస్తుంది . ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాక్టీరియాలతో వచ్చే జ్వరం వస్తుంది . ఇది చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది . గత రెండు, మూడు నెలలుగా వచ్చే ఈ ఫీవర్ ను స్కార్లెట్ ఫీవర్ గా గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులు బాగా ఎక్కువగా నమోదువుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు.

ముఖ్యంగా హైదరాబాద్ , చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ కేసులు ఎక్కువగా రిపోర్టు అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వచ్చే ఫీవర్ కేసులలో 25 నుంచి 30 శాతం స్కార్లెట్ ఫీవర్ కేసులు రిపోర్టు అవుతున్నాయని చెప్పారు గతంలో కేవలం ఒకటి, రెండు శాతం కేసులు వచ్చేవని, ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగిందని వివరించారు.

ఫీవర్, లక్షణాలు: జ్వరాల్లో వైరల్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ఉన్నట్లే.. స్కార్లెట్ ఫీవర్ కూడా ఒక రకమైన జ్వరం.

ఇది స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, చర్మము మీద దద్దుర్లతో మొదలవుతుంది.

సాధారణ జ్వరం తరహాలోనే శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. 102, 103 డిగ్రీల జ్వరం వస్తుంది.

ఈ జ్వరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ‘‘విపరీతమైన గొంతు నొప్పితో స్కార్లెట్ ఫీవర్ మొదలవుతుంది.’’
అంతేకాకుండా నాలుకపై మంట రావడం , శరీరంపై దద్దుర్లు , గొంతులో ఎర్రటి పొక్కులు ,నాలుక రంగు స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
గొంతులో పగుళ్లు కూడా రావొచ్చు.నోరు, మెడ, చేతులు, కాళ్లపై ర్యాషెస్(చిన్నపాటి పొక్కులు)విపరీతమైన దురద, తలనొప్పి, వికారం
కడుపు నొప్పి, జ్వరం, గొంతునొప్పి నాలుగైదు రోజులపాటు ఉంటుందని చెప్పారు. శరీరంపై దద్దుర్లు తగ్గడానికి మాత్రం ఏడు రోజులు పడుతుందని వివరించారు.


ఏ వయసు పిల్లలకు ఎక్కువగా వస్తుంది..

స్కార్లెట్ ఫీవర్ బడి ఈడు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంది.

2 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో ఫీవర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ.
5 నుంచి 7 సంవత్సరాల వయసుకు అవకా‌‍శాలు కాస్త తగ్గుతాయి.
7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఇంకొంచెం తగ్గుతుంది.ఎందుకంటే వీరికి ఇమ్మ్యూనిటీ కొంచం ఎక్కువగా ఉండడం వలన అసలు
ఫీవర్ రాదని కాదుగానీ, వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలో మమ్స్(దవడ బిళ్లలు లేదా గవద బిళ్లల వాపు) వంటివి ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు వేరొక ఇన్ఫెక్షన్లు సోకేందుకు వీలుంటుంది. దీని వల్ల స్కార్లెట్ ఫీవర్ కూడా వ్యాపిస్తుంది.

ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇది అంటు వ్యాధి. ముఖ్యంగా పిల్లల్లో సులువుగా వ్యాప్తి చెందుతుంది.

పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఒకరితో మరొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు పడటం, ఒకరి వస్తువులు మరొకరు వాడడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.స్కార్లెట్ ఫీవర్‌కు సరైన సమయంలో చికిత్స చేస్తే వెంటనే తగ్గిపోతుందని అంటున్నారు. ఆసుపత్రిలో చేరే అవసరం ఉండదు. పిల్లలు ఆహారం తీసుకోలేక నీరసపడిపోవడం, మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే వ్యాధి ముదిరి నిమోనియాకు దారితీస్తే మినహా ఆసుపత్రిలో చేరే అవకాశాలు చాలా తక్కువ’’ అని చెప్పారు .తగిన జాగ్రత్తలు తీసుకొని ఒకరినుండి ఒకరికి వ్యాపించకుండా చూసుకుంటే తొందరగా తగ్గిపోతుంది . మన చుట్టు పక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి .





Untitled Document
Advertisements