తులసి కరివేపాకు మొక్కలను ఎరువంటి కెమికల్స్ వాడకుండా పెంచండిలా..

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 12:02 PM

తులసి కరివేపాకు మొక్కలను ఎరువంటి కెమికల్స్ వాడకుండా పెంచండిలా..

ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్క తులసి . దీని దేవతగా పూజిస్తారు . మన తెలుగు సంప్రదాయంలో తులసికి ప్రాధాన్యత అంత ఇంత కాదు. చాలా మంది మహిళలు ఈ తులసి చెట్టుకి పూజ చేస్తారు. దీనిని ఇంట్లో పెంచుకుంటే శుభమని కూడా భావిస్తారు. అయితే, కొన్నిసార్లు ఈ తులసి త్వరగా వాడిపోతుంది. దానికి కరం ఏమైనా కావచ్చు . వాటర్ ఎక్కువైనా తక్కువైన ఎండిపోతుంది .తెగుళ్ళు, వచ్చిన వాడిపోతుంది . అదే విధంగా,మనలో చాల మందికి కరివేపాకు చెట్టు కూడా ఇంట్లో పెంచుకుంటారు .కరివేపాకు ప్రతి కూరలోనూ వాడుతారు దీనిని పొడి చేసుకుని తింటారు . ఇవి చక్కగా ఏపుగా ఎదగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోండి.

గంజినీరు: మన ఇంట్లో బియ్యము కడిగినతర్వాత వచ్చే వాటర్ ని గంజి నీరు అంటారు . ఈ నీరు కూడా చెట్లకి చాలా బలం. వీటిని చెట్లకి పోయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి, వీటిని కరివేపాకు చెట్లకి పోస్తే తెగుళ్ళు, చిన్న పురుగుల వంటి వాటి నుంచి కాపాడుకోవచ్చు. వీటిని రెండు మూడు రోజులు స్టోర్ చేసి కూడా పోయొచ్చు. దీని వల్ల చెట్లు చక్కగా ఎదుగుతాయి.

పండ్ల తొక్కలు: ఇక మనం వాడే పండ్లు, కూరగాయల తొక్కల్ని పాడేస్తూవుంటాము ఆలా చేయకుండా కరివేపాకు చెట్టుకి వేయొచ్చు. దీని వల్ల ఆ చెట్టుకి పోషకాలు అంది చక్కగా పెరుగుతాయి. కాబట్టి, ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు ఏ పండ్లు తిన్నా కూడా ఆ తొక్కల్ని చెట్టుకి ఎరువుగా వేయండి.

కరివేపాకు చెట్టు పెట్టేటప్పుడు: కరివేపాకుకి గుడ్డు మంచి ఎరువు అని చెప్పొచ్చు. కరివేపాకు చెట్టు పెట్టేటప్పుడు గుడ్డు పెంకులు, కూడా వేసి కరివేపాకు చెట్టు పెట్టండి. అయితే వీటిని అలానే పెంకుల్లా వేయకుండా కాస్తా చిన్న ముక్కలుగా చేసి వేయండి.మన ఇంట్లో ఉండే ఎగ్ పొట్టు పడవేయకుండా ఇలా చేయవచ్చు .


చాలా మంది తులసి చెట్టు పెట్టినప్పుడు అందులోని మరిన్ని తులసి గింజలు వేయడం, చెట్లు పెట్టడం చేస్తుంటారు. అలా కాకుండా ఒక్క చెట్టుని మాత్రమే పెట్టండి. అప్పుడే చెట్టు చక్కగా పెరుగుతాయి. అదే విధంగా నీరు పోసినప్పుడల్లా మట్టి తడిస్తే చాలు. అంతకు మించి నీరు పోయొద్దొని గుర్తుపెట్టుకోండి.ఇది చాల సున్నితమైన చెట్టు .
ఇక తులసి చెట్టుని కొద్దిగా ఎండలో పెట్టండి. ఎండ కచ్చితంగా ఉండాలి. అయితే, మరీ ఎండ కాకుండా పరోక్ష ఎండలో ఉంచండి. నీరు రెగ్యులర్‌గా పోయండి. ఎండాకాలంలో కనీసం రెండు, మూడుసార్లు నీరు పెట్టాలి.

బంకమట్టి.. అదే విధంగా మట్టిని మారుస్తుండడం మంచిది. చెట్టు పచ్చగా ఎదుగుతుంటే పర్లేదు. కానీ, ఏదైనా వాడిపోవడం అలా జరుగుతుంటే బంకమట్టి వేయండి. అదే విధంగా మట్టిని, కుండిని మారుస్తుండండి. అయితే, కేవలం చెట్లు పెరగకపోతేనే ఇలా చేయాలి.ఈ విధంగా
మన పెరటిలో పెరిగే తులసి కరివేపాకు మొక్కలకి , సరిపోయిన వాటర్ ,మట్టిని, కూరగాయలను కడిగినపుడు వచ్చే వాటర్ ను చెట్లకు పోయడం వలన ,చాల ప్రయాజనాలు ఉంటాయి . ఎందుకంటే దానిలో ఎన్నో రకాలైన పోషకాలు ఉన్నాయి . ఈ విధంగా పార్టిలైజర్స్ వాడకుండా చెట్లను పెంచవచ్చు .





Untitled Document
Advertisements