వర్చువల్ గా సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ..

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 12:12 PM

వర్చువల్ గా సికింద్రాబాద్-విశాఖ మధ్య  రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ..

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ళు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్న విషయం విధితమే తాజాగా మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఈ రైళ్ళలో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.
https://twitter.com/kishanreddybjp/status/1767394198033141810?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1767394198033141810%7Ctwgr%5E3fa98198bff072004f7778f070ab159be7491430%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F796001%2Fmodi-inaugurated-second-vande-bharat-express-between-secunderabad-and-vizag





Untitled Document
Advertisements