సులభంగా బరువు తగ్గాలి అనుకునే వారు బే లీవ్స్ తో ఇలా చేయండి..

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 08:26 PM

సులభంగా బరువు తగ్గాలి అనుకునే వారు  బే లీవ్స్ తో ఇలా చేయండి..

మనం నిత్యం ఆహారంలో కొన్ని మసాలా దినుసుల వాడుతుంటాము . అలాంటి వాటిలో బిర్యానీ ఆకులు కూడా ఒకటి. దీన్ని బే లీవ్స్ అని కూడా అంటారు . దీన్నీ ఎక్కువగా బిర్యానీ, పులావ్, చేపల పులుసు వంటి వాటిలో వాడుతారు. బిర్యానీ ఆకులను జోడించడం వలన డిష్ రుచి పెరుగుతుంది. బిర్యానీ ఆకులతో ఆహారం సువాసన, రుచిని పెంచుతుంది. నిజానికి బే ఆకులను తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పోషకాలతో సమృద్ధిగా ఉన్న బిర్యానీ ఆకులు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఇందులో ఉన్నాయి. బే ఆకు అనేక చర్మ, జుట్టు సమస్యలను వదిలించుకోవడంలో కూడా సహాయపడుతుంది. బిర్యానీ ఆకుల వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి చూదాం .

బిర్యానీ ఆకుల హెయిర్ మాస్క్:
మీరు జుట్టు సంరక్షణ కోసం కిచెన్ లో ఉండే బిర్యానీ ఆకులతో హెయిర్ మాస్క్‌ని చేసుకొని అప్లై చేయడం ద్వారా రూట్ నుండి చుండ్రును తొలగించవచ్చు. దీని కోసం బిర్యానీ ఆకులను మెత్తగా రుబ్బి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పెరుగుతో మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి ఆరిన తర్వాత మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఇది తల దురద నుండి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది.
చాల మంది పిల్లలకు చుండ్రు ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో దీనిని ఉపయోగించవచ్చు .


బిర్యానీ ఆకుల వాటర్:

మీ జుట్టు పొడిగా, గజిబిజిగా ఉంటే బిర్యానీ ఆకును ఉపయోగించడం మీకు ఉత్తమమైనది. బిర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించండి. చల్లారిన తర్వాత ఈ నీటితో మీ జుట్టును కడగాలి. ఇది జుట్టు జిగటను కూడా తొలగించి, జుట్టును మెరిసేలా అందంగా తయారుచేస్తుంది.


బిర్యానీ ఆకులు :
స్కూల్ కి వేళే పిల్లలకు జుట్టులో పేనుల సమస్యతో ఇబ్బంది పడుతుంటే బిర్యానీ ఆకులను ఉపయోగించడం ద్వారా పేనులను వదిలించుకోవచ్చు. దీని కోసం 5 బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టి చల్లబరచండి. ఈ నీటితో మీ జుట్టును కడగాలి. అలాగే మీరు బే ఆకు పొడిని పేస్ట్ చేసి మీ జుట్టుకు రాసుకోవచ్చు. దీంతో పేనులన్నీ సులభంగా నశిస్తాయి.

ఇవే కాకుండా దంతాలపై గార తొలగించడంలో బే ఆకులను ఉపయోగించడం వలన ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం బే ఆకు పొడి లేదా పేస్ట్ ను దంతాలపై రుద్దండి. మీరు బే ఆకులను నేరుగా మీ దంతాలపై రుద్దవచ్చు. ఇది మీ దంతాలను తెల్లగా, మెరిసేలా చేస్తుంది.

మెుటిమలకు రెమెడీ:
యుక్త వయస్సు పిల్లలకి హార్మోన్ ఎంబాలన్సుడ్ వలన ముఖంపై మొటిమలు వస్తాయి . అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న బిర్యానీ ఆకులు వాడడం వలన ముఖంపై మొటిమలు, మొటిమల మచ్చలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. దీని కోసం, బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టండి. ఇప్పుడు ఈ నీటితో మీ ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

సులువుగా బరువు తగ్గలనుకునే వారు ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీటిలో 2-3 బే ఆకులను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, బే ఆకుతో నీటిని మరిగించి, తేనెతో టీగా త్రాగాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గడం ప్రారంభిస్తారు. చూడడానికి ఆకు అనుకుంటాం కానీ మన కిచెన్ లో దొరికే ఈ ఆకులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మరి ఈ రోజు నుండి మీ అవసరాలకి తగ్గట్టుగా ఈ ఆకుని వాడుకోవడం ప్రారంభించండిక.





Untitled Document
Advertisements