అలీని రాజ‌కీయ ఎంట్రీ పై శివాజీ కామెంట్స్

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 04:11 PM

అలీని రాజ‌కీయ ఎంట్రీ పై శివాజీ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో లోకసభ ఎన్నికల కారణంగా సీట్ల స‌ర్దుబాటు జరుగుతుంది అన్న సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ హాస్య న‌టుడు అలీ కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యంతో అలీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగానే వినిపిస్తుంది.వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇవ్వాల‌ని ప్రయ‌త్నించారు . కానీ సీటు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో కుద‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో తాజా ఎల‌క్ష‌న్ లో అలీకి ఛాన్స్ ఉంద‌ని వినిపిస్తుంది.
చివ‌ర‌కి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమించింది. ప్ర‌స్తుతం అలీ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. 2024 ఎన్నిక‌ల నేప‌థ్యంలో అలీ టికెట్ ఇచ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌నే ప్ర‌చారం బ‌లంగా సాగుతోంది. ఇక అలీ వైకాపా కంటే ముందు వివిధ పార్టీల్లోనూ ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.కొన్నాళ్లు టీడీపీ పార్టీలో కొన‌సాగారు. అలాగే జ‌న‌సేన అధ్యక్షడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అలీ మంచి స్నేహితుడైనా అలీ మాత్రం ఆ ఆపార్టీకి మొదటి నుంచి దూరంగానే ఉన్నారు.
తాజాగా ఒక టాక్ షోలో నటుడు అలీ శివాజీ మ‌ధ్య రాజ‌కీయ విషయాలపై చ‌ర్చ‌కొచ్చింది. 'నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా? అని అలీని.. శివాజీ ప్రశ్నించారు. దానికి అలీ జవాబు చెప్పకుండా.. ఎదో ఒక రకంగా అందరూ బాగానే ఉన్నారు కదా.. ఇంకేటి విశేషాలు? అంటూ స్కిప్ కొట్టే ప్ర‌య‌త్నం చేసారు. కానీ శివాజీ మాత్రం అల కాదు తాను అనుకున్న‌ది ముఖం మీద‌నే చెప్పేసాడు. త‌ను అనుభ‌వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. 'నేనైతే ఒప్పుకోను. నువ్వు అస్స‌లు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డొద్దు . బాహ్యా ప్ర‌పంచంలో నీకు అనుభ‌వం ఎక్కువ‌. పాలిటిక్స్ ప‌రంగా గ్రౌండ్ లెవ‌ల్లో నాకు అవ‌గాహ‌న ఎక్కువ‌గా ఉంది. పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాక ఈ అవగాహన వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లిన వారు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు తిరిగి తేచ్చుకునే సత్తా మనకుండాలి. ఆ తిరిగి తీసుకోవడం కూడా చాల పనితో కూడుకున్నది. ఆఖరికి ఇసుక.. మట్టి వంటి ప్రకృతి వనరులను కూడా దోచుకోవాలి. వివిధ పథకాల్లో వచ్చే డబ్బును ప్రజలకు అందకుండా చేయాలి. ప్రజలను ఎలాంటి మోసానికైనా చేయాలి అలా నువ్వు చేయగలవా? ఒకరికి పెట్టడం మాత్రమే నీకు తెలుసు నువ్వు ఎవర్నించీ తీసుకోలేవు. అందుకు దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు. నువ్వు ఉన్న పార్టీ కోసం మాత్రం పనిచేయ్. ఇది నా రిక్వెస్ట్. ఈ ఒక మాట విను ప్రజల కోసం చేయాలి అంటే ఏవైనా మంచి పనులు చేయ అంతే కానీ రాజకీయాలలోకి మాత్రం రాకు దీని అంత మురికి కుంట మరొకటి లేదు.





Untitled Document
Advertisements