బీఆర్ఎస్ నేత కవిత ఇంట్లో ఈడీ సోదాలు..

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 04:30 PM

బీఆర్ఎస్ నేత కవిత ఇంట్లో ఈడీ సోదాలు..

దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అందరికి తెలిసిందే. తాజగా ఈ కేసులో మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఇప్పటికే పలుమార్లు విచారించారు. ప్రస్తుతం విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు దాదాపు గంట సేపటి నుంచి సోదాలు జరుపుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలను నిర్వహిస్తున్నారు.

మరోవైపు కవితతో పాటు, ఆమె సహచరులు అందరి మొబైల్ ఫోన్లను అధికారులు తీసుకున్నారు. సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరో మూడు, నాలుగు గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది. కవిత ఇంట్లోకి ఎవరినీ ఈడీ అధికారులు అనుమతించడం లేదు. కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒక్కసారిగా ఎదురైనా పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.





Untitled Document
Advertisements