ఈ కురగాయతో గుండె జబ్బు వచ్చే రిస్క్ తగ్గుతుందట!

     Written by : smtv Desk | Sat, Mar 16, 2024, 06:28 AM

ఈ కురగాయతో గుండె జబ్బు వచ్చే రిస్క్ తగ్గుతుందట!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వయస్సుతో తేడా లేకుండా హార్ట్ అట్టాక్ బారిన పడుతున్నారు . దీని నుండి కాపాడుకోవడానికి మంచి ఆకుకూరలతో పాటు కూరగాయలను మనం నిత్యం తీసుకునే ఆహారం లో భాగంగా చేసుకొని తీసుకోవాలి . వీటిలో ముఖ్యంగా చిక్కుడు జాతికి చెందిన ​ గ్రీన్‌ బీన్స్‌. వీటిని స్ట్రింగ్ బీన్స్‌, స్నాప్‌ బీన్స్‌ అని కూడా పిలుస్తుంటారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో విటమిన్‌ ఏ, సి, కె, ఫోలిక్‌ యాసిడ్, మాంగనీస్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రీన్‍ బీన్స్‌ తరచు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.​

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. గ్రీన్ బీన్స్‌లో ఫ్లేవనాయిడ్‌లు, కెరోటినాయిడ్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి తోడ్పడతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడానికి దోహద పడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. గ్రీన్‌ బీన్స్‌లో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌ కంటెంట్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి, హృదయనాళ పనితీరును ప్రోత్సహిస్తాయి. తద్వారా. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇంతే కాకుండా ఎముకలను బలంగా ఉంచుతాయి.గ్రీన్‌ బీన్స్‌లో విటమిన్‌ కె, మాంగనీస్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఈ పోషకాలు. ఎముక ఖనిజీకరణ, సాంద్రతకు దోహదం చేస్తాయి. మన డైట్‌లో తరచు గ్రీన్‌ బీన్స్‌ చేర్చుకుంటే.. బోలు ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుంది.

గ్రీన్ బీన్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి,యు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువును కంట్రోల్‌లో ఉంచడానికి బీన్స్‌ సహాయపడతాయి.

కంటి ఆరోగ్యానికి మంచిది.. గ్రీన్ బీన్స్‌లో బీటా కెరోటిన్, లుటిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సమ్మేళనాలు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, ఇతర కంటి రుగ్మతల నుంచి రక్షించడానికి తోడ్పడతాయి.

ఇమ్యూనిటీ బూస్ట్‌ చేస్తాయి.. గ్రీన్ బీన్స్‌లోని విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడానికి తోడ్పడతాయి. విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి తోడ్పడుతుంది.ఇన్ని ఉపయోగాలు ఉన్న గ్రీన్ బీన్స్‌ను ఆహారంలో తినడానికి ఇష్టపడరు . కానీ చపాతీలోకి ఫ్రైల చేసుకొని తింటే చాల బాగుంటుంది జొన్న రోటిలో కూడా చాల బాగుంటుంది .





Untitled Document
Advertisements