తలిదండ్రులు పిల్లలను కొట్టడం వలన జరిగేది ఇదే

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 04:19 PM

తలిదండ్రులు పిల్లలను కొట్టడం వలన జరిగేది ఇదే

వేసవి కాలం వచ్చింది ఇంకా పిల్లల స్కూల్ లక్కు సెలవులు మొదలు అయ్యాయి . ఇంకా పిల్లల అల్లరిని భరించడం ఇంట్లో ఎవరి తరం కాదు అందుకని చాల మంది పేరెంట్స్ చిటికి మాటికీ పిల్లలని కొడుతుంటారు. అంతేకాకుండా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టడం లేదా బెదిరించడం చేస్తారు. పిల్లల దృక్పథం, ప్రవర్తన సరిగ్గా ఉండాలని తల్లిదండ్రులు ఇలా చేయడం సాధారణం. అలాగే పిల్లలు చెప్పేది వినకపోయినా, దురుసుగా ప్రవర్తించినా వారికి బుద్ధి చెప్పాలి, కొట్టకూడదు. ఇది పిల్లలపై ప్రభావం చూపుతుంది. పిల్లలను శిక్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

విదేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టకూడదు. ఇది నేరం. కానీ భారతదేశంలో మాత్రం తల్లిదండ్రులు పిల్లలను కొడుతూ ఉంటారు. ఏడిస్తే ఇంకో రెండు ఎక్కువగా తగిలిస్తారు. అలా చేయడం తప్పు. దానికి కూడా ఒక పరిమితి ఉండాలి. అంతేకాదు, పదే పదే కొట్టడం వల్ల పిల్లవాడు ఒంటరిగా ఉంటాడు. అది వారి విద్యా, భావోద్వేగ మేధస్సు, నిరాశ, జీవిత ఆందోళనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీకు కోపం వచ్చినప్పుడు, ముందుగా లోతైన శ్వాస తీసుకోండి. దీని తర్వాత పిల్లలతో మాట్లాడండి. పిల్లల తప్పును చాలా మెల్లగా, కొంత బెదిరించినట్టుగా బిగ్గరగా చెప్పండి. అది పని చేయకపోతే, పిల్లల చేతుల నుండి ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ప్లే టైమ్‌ని తీసివేయండి.

చాలా మంది తల్లులు కోపంతో తమ పిల్లలను తిడతారు. కానీ అర్థం లేకుండా పిల్లవాడిని తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇలా చేయడం వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మాటలు మాట్లాడకండి. చెడు మాటలు వాడితే ఆ పిల్లవాడు మంచివాడిగా ఎదగడు. వాడు కూడా చేదు మాట్లాడడానికి చూస్తాడు . తల్లితండ్రులు అరవడం కాకుండా పిల్లలతో మాట్లాడండి. పిల్లల మనస్సును ఏదో ఒక విధంగా మళ్లించండి. ముఖ్యంగా, పిల్లల ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇలా చేస్తే పిల్లలు అలవాటు పడతారు.ఇంకా కొంత మంది అయితే తమ పిల్లలను తిట్టకుండా, కొట్టకుండా చీకటి గదిలో ఉంచుతారు. కానీ అది పిల్లలను మానసికంగా ప్రభావితం చేస్తుంది. నన్ను ఎవరూ ఇష్టపడరని పిల్లలు అనుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే అది వారిని ఒంటరిగా, ఆత్మహత్యకు గురి చేస్తుంది. అంతే కాకుండా సవాళ్లను స్వీకరించడానికి విముఖత, జీవితం పట్ల ప్రతికూల భావన ఉండవచ్చు.కావాలనుకుంటే కాస్త చిన్నగా పిల్లలను బెదిరించండి. ఇది చాలా సులభమైన శిక్ష. పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి ఇదొక గొప్ప మార్గం. దురుసుగా ప్రవర్తించినప్పుడు బెదిరించి ఇలా చేయడం వలన కలికే సమస్యల గురించి వారికీ వివరించి చెప్పండి . అంతేకాకుండా కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తారు. అలా చేయడం ప్రోత్సాహకరంగా ఉంటుందని వారు నమ్ముతారు. కానీ అందుకు విరుద్ధంగా ఉంది. పోలిక ద్వారా పిల్లలు ప్రభావితం అవుతారు. ఒక పిల్లవాడు తన బలహీనతలను మాత్రమే చూస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఇది పిల్లవాడు గొప్ప విషయాలను సాధించకుండా నిరోధిస్తుంది. పిల్లలతో పోల్చడం మానేసి, పిల్లల బలహీనతలపై దృష్టి పెట్టండి. ఇది చాలా ఉపయోగకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది.చిన్న చిన్న విషయాలకు పిల్లలను కొట్టడడం తిట్టడం అలాంటివి చేయకుండా వారికీ నచ్చే విధంగా చేప్పి చూడండి





Untitled Document
Advertisements