లాభాల్లో దూసుకేలుతున్న స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Thu, Apr 18, 2024, 12:31 PM

 లాభాల్లో దూసుకేలుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్యా నానాటికి పెరిగిపోతూనే ఉంది. ఈ స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరు ఊహించలేరు. అయితే నేటి ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు బీఎస్ ఈ సెన్సెక్స్ 73,183 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది ఇదివరకటి ముగింపుతో పోలిస్తే 239.42 పాయింట్లు లేదా 0.33 శాతం ఎక్కువ. అదే విధంగా ఎన్ఎస్ ఈ నిఫ్టీ 64.45 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో 22,212 పాయింట్ల స్థాయి వద్ద మొదలైంది. సెన్సెక్స్ ఇండెక్స్ 291.27 పాయింట్లు పుంజుకొని 73,234.95 వద్ద ప్రారంభమవగా నిఫ్టీ 102.75 పాయింట్లు పెరిగి 22,250.65 పాయింట్ల వద్ద మొదలైంది.

కంపెనీల పనితీరు
నిఫ్టీ కంపెనీల్లో 40 కంపెనీలు వృద్ధిని నమోదు చేయగా 10 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లాభపడ్డ కంపెనీల్లో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హీరో మోటోకార్ప్, అదానీ ఉన్నాయి. ఇక టాప్ లూజర్ల జాబితాలో హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి.

మార్కెట్ ట్రెండ్
21 రోజుల ఎక్స్ పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (ఈఎంఏ) ను ఇండెక్స్ దాటినా ట్రెండ్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ తెలియజేస్తోంది. అయితే అధిక విక్రయాల మద్దతుతో మార్కెట్లు సుమారు 22,000 పాయింట్ల వద్ద పుంజుకొనే అవకాశం కనిపిస్తోంది. ఆసియా ప్రాంతం మొత్తంగా ఈక్విటీల పనితీరు మిశ్రమంగా ఉంది. జపాన్ స్టాక్ లు తగ్గుతుండగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ఈక్విటీలు పుంజుకుంటున్నాయి.





Untitled Document
Advertisements