బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరిన పిటిషనర్లు.. సుప్రీంకోర్టు తీర్పు?

     Written by : smtv Desk | Fri, Apr 26, 2024, 12:47 PM

బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరిన పిటిషనర్లు.. సుప్రీంకోర్టు తీర్పు?

ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలను నిర్వహించాలని పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎంలను ఈజీగా ట్యాంపరింగ్ చేయొచ్చని, అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలోనూ బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరుగుతున్నాయని వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎంల్లో పోలైన 100 శాతం ఓట్లను సరిపోల్చాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేలా ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ప్రజాస్వామ్యం అనేది భిన్నమైన మూలస్తంభాల మధ్య సామరస్యం, విశ్వాసంతో కూడుకున్నదని ఈ సందర్భంగా జస్టిస్ట్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందంతో ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేసేందుకు మాత్రం అనుమతించింది.
‘ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి చేయడం.. ఎన్నికల ప్రక్రియపై గుడ్డిగా అపనమ్మకం పెంచుకోవడం అనవసర అనుమానాలకు దారి తీస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఒకే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినా.. కానీ వేర్వేరు తీర్పులను వెలువరించారు.





Untitled Document
Advertisements