కేంద్రాన్ని హెచ్చరించిన చంద్రబాబు

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 06:40 PM

కేంద్రాన్ని హెచ్చరించిన చంద్రబాబు

నెల్లూరు, నవంబర్ 20: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో మంగళవారం తెదేపా చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుంటే.. బిజేపి నేతలకు కడుపుమండుతోందని ఎద్దేవా చేశారు. చట్టంలో చెప్పినట్టు దుగరాజపట్నం పోర్టు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు, రాష్ట్రంలోని సోకాల్డ్ నేతలు రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అహ్మదాబాద్‌-ముంబై కారిడార్‌కు రూ. లక్షా10 వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ. 3వేల కోట్లు ఇచ్చారని, ఏమీ లేని ఏపీలో విజయవాడ, విశాఖ మెట్రోకు అతీగతీ లేదని చంద్రబాబు విమర్శించారు.

ఢిల్లీలో ఏపీభవన్‌ కూడా విభజించే పరిస్థితి లేదన్నారు. విభజన సయమంలో తెదేపా ఎంపీలు అందరికంటే ఎక్కువగా పోరాడారని చంద్రబాబు కొనియాడారు. వైసీపీ ఏదారిలో వెళ్తుందో నాకు తెలుసన్నారు. కేంద్రం నుంచి రూ. 75 వేల కోట్లు రావాలని కమిటీ వేసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇప్పుడు కిమ్మనకుండా ఉన్నారన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసిన తెదేపాను, ఏపీని ఏమి చేయలేరన్నారు.

Untitled Document
Advertisements