ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో బస్సులు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 02:51 PM

ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో బస్సులు

ఏపీలో కరోనా కల్లోలం మొదలైంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.. జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను 50% ఆక్యుపెన్సీతో నడపేలా ఆదేశించాలంటూ హైకోర్టులో నెల్లూరుకి చెందిన న్యాయవాది జీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ దీనిని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

కేంద్రం జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా పూర్తి సామర్థ్యంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నడుపుతున్నారని.. దీనివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని పిటిషన్‌లో లాయర్ శ్రీకాంత్ ప్రస్తావించారు. స్పందన కార్యక్రమం ద్వారా తాను కొన్ని అభ్యంతరాలను చెప్పానని.. కానీ అధికారులు పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 50% ఆక్యుపెన్సీతో బస్సులు నడిపి, ప్రయాణికులు కరోనా బారినపడకుండా చూడాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.





Untitled Document
Advertisements