వంటలలో టమాటాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే ప్రమాదం తప్పదట

     Written by : smtv Desk | Sat, Feb 25, 2023, 01:43 PM

వంటలలో టమాటాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే ప్రమాదం తప్పదట

తినడానికి రుచిగా ఉంటుంది. ధర తక్కువ పైగా పోషకాలు మెండు. ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్న కూరగాయ టమాటా. ఈ టమాటా ని ధనికులే కాదు పేదవారు సైతం ఆహారంగా తీసుకోవడానికి అందుబాటులో ఉండే కూరగాయ. ఆరోగ్యానికి సైతం టమాటా వలన ఎంతో మేలు చేకూరుతుంది. అయితే టమాటా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా?
నిజానికి టమాటాలు తక్కువ ధరలో అధిక మొత్తంలో దొరుకుతాయి. కనుక మనం దాదాపు ప్రతి వంటలో టమాటా వేస్తాం. చివరికి చికెన్ కర్రీలో కూడా టమాటా వేస్తాం. ఈ టమాటాలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే సులువుగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. టమాటా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా? టమోటాల అధిక వినియోగం మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

అలర్జీ సమస్య: టమోటాలో ఉండే హిస్టమిన్ సమ్మేళనం అలర్జీని కలిగిస్తుంది. కాబట్టి, టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల దగ్గు, తుమ్ములు, గొంతు మంట, ముఖం, నాలుక వాపు వంటివి వస్తాయి. అయితే మీకు ఇప్పటికే అలెర్జీ సమస్య ఉంటే, మీరు టమోటాలు తీసుకోవడం మానేయాలి.

పొట్ట సమస్య: టమోటా ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. మీరు ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్టయితే, టమోటాలు తినడం మానేయండి. దీన్ని తీసుకోవడం వల్ల పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు, మీకు ఇప్పటికే మలబద్ధకం ఉంటే, మీరు పొరపాటున కూడా టమోటాలు తినకూడదు.

కిడ్నీ స్టోన్ సమస్య: క్యాల్షియం పుష్కలంగా ఉండే టమోటాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి, మీరు కూడా టమోటాను ఎక్కువగా తీసుకుంటే ఈ రోజు నుండే జాగ్రత్తపడండి. లేదంటే ప్రమాదం బారిన పడాల్సి ఉంటుంది.
మరి టమాటాలలో ఉండే లాభాలతో పాటు అధికంగా తినడం వలన కలిగే నష్టాల గురించి కూడా తెలుసుకున్నారుగా ఇక టమాటాలను వాడే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.





Untitled Document
Advertisements