ఆరోగ్య సంరక్షణకు సూపర్ ఫుడ్స్ ఇవే..

     Written by : smtv Desk | Mon, Feb 27, 2023, 02:21 PM

ఆరోగ్య సంరక్షణకు సూపర్ ఫుడ్స్ ఇవే..

ఆరోగ్యంగా జీవించేందుకు మంచి పోషకాలు పుష్కలంగా ఉండి, తక్కువ కేలరీలు ఇచ్చే వాటిని సూపర్ ఫుడ్స్ గా చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటి తెలుసుకుందామా..

బ్లూ బెర్రీలు:- ఫైబర్, మాంగనీస్, విటమిన్ కే సహా మంచి యాంటీ ఆక్సిడెంట్లు బ్లూ బెర్రీల్లో పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను నివారించేందుకు బ్లూబెర్రీలు సాయపడతాయి.

గోజి బెర్రీలు:- చిన్నగా, ఎర్రగా ఉండే ఈ బెర్రీల్లో విటమిన్ సీ, ఈ, పలు రకాల ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. వీటితో కాలేయం, కిడ్నీల ఆరోగ్యం బలపడుతుంది.

ఆకుపచ్చని కూరలు:- పాలకూర, కొల్లార్డ్ గ్రీన్స్ (కశ్మీర్లో పండే) సూపర్ ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటిల్లో విటమిన్ ఏ, సీ, ఈ, కే దండిగా లభిస్తాయి. కెరటోనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం సైతం లభిస్తాయి.

సాల్మన్:- ఇవి ఒక రకం చేపలు. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను ఇవి తీసేస్తాయి. దీంతో గుండెకు రక్షణ ఏర్పడుతుంది.

నట్స్:- వాల్ నట్, ఆల్మండ్ నుంచి ప్లాంట్ ప్రొటీన్ లభిస్తుంది. మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. గుండె జబ్బుల నుంచి రక్షణనిస్తాయి.

క్రూసిఫెరోస్ కూరగాయలు:- బ్రొక్కోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా క్రూసిఫెరోస్ కిందకే వస్తాయి. వీటిల్లో ఫైబర్, ఇండోల్స్, నైట్రైల్స్, థియోసైనేట్స్ వంటి ఫైటో కెమికల్స్ తగినంత లభిస్తాయి.

సీడ్స్:- సన్ ఫ్లవర్, గుమ్మడికాయ, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. కొలెస్ట్రాల్, గుండెజబ్బుల రిస్క్ ను ఇవి గణనీయంగా తగ్గించగలవు.





Untitled Document
Advertisements