మార్కెట్లోకి అందుబాటులో మరో కొత్త ఈ స్కూటర్.. ఏకంగా 236 కి.మీ. మైలేజీ

     Written by : smtv Desk | Thu, Apr 27, 2023, 12:24 PM

మార్కెట్లోకి అందుబాటులో మరో కొత్త ఈ స్కూటర్.. ఏకంగా 236 కి.మీ. మైలేజీ

ప్రస్తుతం అంత ఎలక్ట్రిక్ యుగం నడుస్తుంది. వంట చేసుకునే సాధనాల నుండి నడిపే వాహనాల వరకు అన్ని ఎలక్ట్రిక్ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఫీచర్లు, మంచి మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు బైక్ ల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు స్టార్టప్ లో సరికొత్త ఈ-స్కూటర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ కూడా ఓ ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తొలుత బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు ఆపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో తమ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ
‘సింపుల్ వన్’ పేరుతో మే 23న మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ స్కూటర్ సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. అత్యధిక వేగంతో దూసుకుపోయేలా తీర్చిదిద్దిన ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జి చేస్తే 236 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాణాలకు అనుగుణంగా స్కూటర్ లో నాణ్యమైన బ్యాటరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

సింపుల్ వన్ విశేషాలు..

4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ.. ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 236 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఛేంజింగ్ బ్యాటరీ ప్యాక్ సదుపాయంతో మైలేజీని 300 కిలోమీటర్లు పెంచుకోవచ్చు.
4G కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్స్, మ్యూజిక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టీపుల్ రైడింగ్ మోడ్‌లు, నావిగేషన్ సిస్టమ్ వంటి స్పెషల్ ఫీచర్లు
ప్రస్తుతం ఈ స్కూటర్ గ్రేస్ వైట్, బ్లూ, బ్లాక్, రెడ్ రంగుల్లో తీసుకొస్తున్నట్లు వెల్లడించిన కంపెనీ





Untitled Document
Advertisements