రాత్రుళ్ళు కలత లేని కమ్మని నిద్ర కొరకు ఇలా చేయండి..

     Written by : smtv Desk | Wed, May 17, 2023, 11:44 AM

రాత్రుళ్ళు కలత లేని కమ్మని నిద్ర కొరకు ఇలా చేయండి..

ప్రస్తుతకాలంలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకుండా పోవడం, ఆహారపుటలవాట్లు, మారిన జీవనశైలి కారణంగా సమయానికి తిని కంటినిండా నిద్రపోవడం అనే మాట లేకుండా పోయింది. నిజానికి మనిషికి నిద్ర అనేది ఎంతో అవసరం. నిద్రపట్టడానికి,బరువు తగ్గడానికి సాయంత్రం ఆరు గంటల లోపు తినడం అలవాటు చేసుకోవాలి. కొంత మంది నిద్ర పట్టడం లేదు అంటుంటారు. పెద్దవాళ్లు మధ్యాహ్నం కొన్ని గంటలు నిద్రపోతూ ఉంటారు. రాత్రి నిద్ర పట్టలేదు అని అంటుంటారు. మనకు ఒక రోజులో ఆరు గంటల గాఢనిద్ర సరిపోతుంది. పిల్లలకు 8 నుండి 10 గంటల నిద్ర అవసరం. మరీ చిన్నపిల్లలైతే 18 గంటలు పడుకుంటారు. మధ్యాహ్నం పడుకున్న తర్వాత రాత్రి నిద్ర సరిగా రాదు దాని కోసం నిద్రమాత్రలు వేస్తూ ఉంటారు. నిద్ర మాత్రలు వేసుకుని పడుకోవడం రోజు ఒక అలవాటుగా మారి పోయి రోగాలు తెచ్చిపెడుతుంది. నిద్రపట్టక పోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి మానసిక ఆందోళన రెండవది వాతము పెరుగుట. శుద్ధమైన నూనె తింటే వాతం పెరగదు. శుద్ధమైన నూనె అంటే గానుగ ద్వారా తీసినది చిక్కగా ఉంటుంది.ఘాటైన వాసన వస్తుంది.ఒక చెంచా మెంతులు రాత్రి గోరువెచ్చని నీటితో నానబెట్టి ఉదయం ముఖం కడగగానే పరగడుపున నమిలి తినాలి. అలా తింటే వాతం తగ్గుతుంది. ఇది షుగర్ ను కూడా అదుపులో ఉంచుతుంది. దీనిని తిన్న తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉండడం మంచిది. రెండవది మానసిక ఆందోళన.. రాత్రి పడుకునే ముందు పదిహేను నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటే మానసిక ఆందోళన తగ్గి నిద్ర వస్తుంది. నిద్ర పోవడానికి టాబ్లెట్లను వాడటం మంచిది కాదు. వీలైనంత వరకు శరీరం అలసిపోయే విధంగా జాగ్రత్తపడితే చక్కటి నిద్ర మీ సొంతం అవుత్తుంది.

* రాత్రి పడుకునే ముందు ఒక కట్ట కొత్తిమీర రసం ఒక గ్లాసు నీటిలో కలుపుకుని త్రాగి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.థైరాయిడ్ కూడా తగ్గుతుంది.
* రోజు ఒక చెంచా జటమాసి చూర్ణం రాత్రి భోజనానికి ఒక గంట ముందు నీటితో కలిపి తాగితే నిద్ర బాగా వస్తుంది. హై బీపీ అదుపులో ఉంటుంది. రక్త శుద్ధి జరుగుతుంది.మెదడుకు కూడా బలాన్నిస్తుంది.
* బాదం నూనె పడుకునే ముందు తలకు మర్దనా చేయాలి రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
* పైనాపిల్ తిన్నా కూడా నిద్ర వస్తుంది.
* ఆవు నెయ్యి రాత్రి పడుకునే ముందు కళ్ళకు కాటుక వలే పెట్టుకోవాలి. రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి. అలా చేస్తే నిద్ర బాగా వస్తుంది.
* అశ్వగంధ చూర్ణం ఒక చెంచా ఒక చెంచా ఆవు వెన్న కలిపి తింటే కూడా బాగా నిద్ర వస్తుంది.





Untitled Document
Advertisements