ఇలా సింపుల్గా మీ రొటీన్ మార్చుకుంటే తేలికగా బరువు తగ్గొచ్చు!

     Written by : smtv Desk | Wed, May 17, 2023, 12:01 PM

ఇలా సింపుల్గా మీ రొటీన్ మార్చుకుంటే తేలికగా బరువు తగ్గొచ్చు!

వేసుకునే దుస్తులు కాస్త బిగుథైతే చాలు. ఈ కాలం అమ్మాయిలు తెగ ఆందోళన పడుతుంటారు. అప్పట్లో అలా ఉండేదాన్ని అంటూ.. పాత ఫోటోలను తెగ చూసుకుంటారు. ఆహారం మానేసినా తమకు తోచిన పద్ధతిలో సన్నబడేందుకు ప్రయత్నిస్తారు. కానీ దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయింటాన్నారు నిపుణులు. కానీ ఇలా చేయడం సరికాదు అంటున్న నిపుణులు అసలు ఏం చేయాలి అనేది చక్కగా వివరిస్తున్నారు.

ఆహారం మానేసిన అంతమాత్రాన బరువు తగ్గిపోతారు. శరీరానికి సరిపడా శక్తిని అందించే ఆహారం తీసుకోవాలి. మానేయడానికి బదులు ఇంట్లో చేసిన పదార్థాలకు ప్రాధాన్యత నివ్వండి నూనెలు, తీపి వస్తువులు పరిమితంగా తీసుకోవడం మొదలుపెట్టాలి.

మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.రాత్రి సమయంలో చాలా మంది లేవలసి వస్తుందని నీళ్లు తాగడం మానేస్తారు. అలా చేయకుండా మధ్యలో లేచి నీళ్లు తాగాలి. అలానే కీరదోస, నిమ్మ ముక్కలు, పుదీనా వంటివి కలిపి నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అదనపు కొవ్వు కరిగించడంలో ను ఈ నీళ్లు ఉపకరిస్తాయి.

జిమ్ యోగా వంటివి చేయకపోయినా తప్పకుండా ఉదయపు నడక,ఈత,టెన్నిస్ ఆడటం వంటివి చేయాలి . ఈ కాలంలో బద్దకం ఉండొద్దు కాబట్టి త్వరగా మేలుకొనే ఈ వ్యాపకాల కు ప్రాధాన్యమిస్తే త్వరగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

రాత్రిపూట తక్కువ ఆహారంతో సరిపెట్టడం మంచి పద్ధతే కానీ... మర్నాడు నీరసం రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే పండ్లు, మజ్జిగ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

ఆలస్యంగా నిద్రపోవడం, తినడం వంటివి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి జీవన శైలికి అలవాటు పడితే... క్రమంగా బరువు పెరిగి ఊబకాయు నికి దారి తీయవచ్చు. అందుకే ఎనిమిది గంటల లోపు తినేసి సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బరువు సమస్య ఉండదు.

టీ,కాఫీలకు బదులు గ్రీన్,వైట్,బ్లాక్ టీ వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. కెఫిన్  కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుందని బ్రిటిష్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements