చిన్నవారు పెద్దవారి పాదాలకు సమస్కరించుటకు కారణం?

     Written by : smtv Desk | Thu, May 18, 2023, 01:38 PM

చిన్నవారు పెద్దవారి పాదాలకు సమస్కరించుటకు కారణం?

పండగలు, పబ్బాలు.. పూజలు, శుభకార్యాలు సందర్భం ఏదైనా పెద్దవారికి చిన్నవారు పాదాభివందనం చేయడం అనేది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుకగల కారణాలు ఏంటి అంటే.. పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్ధప్రేమ, వారు చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనం చేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు బిడ్డలు చేసే పాదాభివందనాన్ని ఈ సందర్భంలో పేర్కొనాలి. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు వారి ఆశీర్వాదాలు అందుకుంటారు. కుటుంబంలో, సమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవంతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం మనకు అందిస్తుంది, ముఖ్యంగా తల్లికి పెట్టె నమస్కారం ఆరుసార్లు భూ ప్రదక్షిణ చేసినంత, పదివేల సార్లు కాశీ వెళ్ళివచ్చినంత, వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత. పుణ్యానికి పదిరెట్లు ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుందని నీతిశాస్త్రం భోదిస్తుంది.





Untitled Document
Advertisements