పగిలిన పాదాల సంరక్షణకు ఇంటి చిట్కాలు..

     Written by : smtv Desk | Fri, May 19, 2023, 02:00 PM

పగిలిన పాదాల సంరక్షణకు ఇంటి చిట్కాలు..

కాలాలతో సంబంధంలేకుండా పాదాలు పొడిబారడం, పగలడం వంటివి జరుగుతూ ఉంటాయి. మరి పాదాల పగుళ్ళ నివారణ కోసం మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
*: బొప్పాయి, పైనాపిల్, అవకాడో పండ్ల గుజ్జు ఒక్కొక్కటి అర కప్పు తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కలిపిన మిశ్రమాన్ని ఆరిపాదాలకు పట్టించాలి.
* ఒక టేబుల్ స్పూన్ సీసం ఆయిల్ లో మూడు టేబుల్ స్పూన్ల తేనె కలిపి కొద్దిగా వేడి చేసి ఈ మిశ్రమాన్ని పాదంపై పగుళ్లు ఏర్పడిన చోట రాస్తే తగ్గుతాయి.
* గోరువెచ్చని నీటితో కాళ్లు కడుక్కుని ఆయిల్ తో మసాజ్ చేస్తే పాదాలు సున్నితంగా తయారవుతాయి.
* ఒక టీస్పూన్ మామిడి చెట్టు చిగురు కి కొద్దిగా నీళ్లు కలిపి రాస్తే పగుళ్ళు క్రమేపీ తగ్గుతాయి.
* గోరింటాకు, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై మరగనిచ్చి ఆ మిశ్రమాన్ని కాలి పగుళ్ల పైన రాస్తే త్వరగా తగ్గుతాయి.
* మర్రి పాలను అరికాళ్లకు మడమలకు పూసి ఆరాక శుభ్రపరుచుకోవాలి.
* కొబ్బరి నూనెలో మైనం వేసి కాచి పగుళ్లకు రాస్తే త్వరగా నయం అవుతాయి.
* ఆవనూనెలో పసుపు పొడి కలిపి పాదాలకు పూస్తే పగుళ్లు తగ్గిపోవడమే కాక పాదాలు మృదువుగా అవుతాయి.
* జిల్లేడు పూలు పచ్చివి నూరి అరికాళ్లకు కడితే పగుళ్ళ మూలంగా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* వేపాకు, నీళ్లు ముద్దలాగా చేసి రాత్రిపూట కాళ్ళ పగుళ్ళకు పూసి ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.





Untitled Document
Advertisements