60 లలో సైతం యంగ్ గా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి !

     Written by : smtv Desk | Fri, Jun 02, 2023, 02:24 PM

60 లలో సైతం యంగ్ గా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి !

నిత్యం యవ్వనంగా కనిపించాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానేఎ అందరికి అది సాధ్యం కాదు. నిజానికి ఎవరికైనా సరే వయసు మీద పడుతోందని.. వృద్ధాప్యం పలకరిస్తోందని.. వారి రూపాన్ని చూసి చెప్పొచ్చు. కొందరు చిన్న వయసులోనే వృద్ధుల మాదిరిగా కనిపిస్తే, కొందరు 60 ఏళ్లు వచ్చినా 45 ఏళ్ల వయసులో ఉన్నట్టుగా అనిపించడం మనం చూస్తూనే ఉంటాము.
అయితే అలా కనిపించడానికి కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఒకరి జీవనశైలి వారి యవ్వనత్వాన్ని నిర్ణయిస్తుందనేది నిజం. మంచి ఆరోగ్యకర అలవాట్లు ఉన్న వారిలో వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది. సరైన అలవాట్లు లేని వారిలో ముందుగా పలకరిస్తుంది. అందుకే యవ్వనంగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు ఉండాలంటే ఏమి చేయకూడదో న్యూట్రిషనిస్ట్ మన్ ప్రీత్ వెల్లడించారు.


డైట్ సోడాను తీసుకోవద్దు.
కృత్రిమ తీపి పదార్థాలను దూరం పెట్టాలి. చెరకు నుంచి వచ్చే చక్కెర కృత్రిమ తీపి అవ్వదు.
ప్లాస్టిక్ కంటెయినర్లను వినియోగించొద్దు
నిద్రకు ముందు ఫోన్ ను ఉపయోగించొద్దు
శారీరకంగా బలంగా ఉండేందుకు సాధనాలు చేయాలి.
బరువు తగ్గాలని చెప్పి తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, లేదంటే తినకుండా పస్తు ఉండడం చేయకూడదు.
అధికంగా ప్రాసెస్ చేసిన, ఉప్పు అద్దిన స్నాక్స్ (ఉదాహరణకు ఆలూ చిప్స్) తీసుకోవద్దు.
కాళ్లు చాపి ఎక్కువ సేపు కూర్చోవడం చేయొద్దు.
రోజులో మూడు కప్పులకు మించి కెఫైన్ (కాఫీ) తీసుకోవద్దు.
అవసరం అయినప్పుడు హెల్త్ సప్లిమెంట్లను తీసుకోకుండా ఉండడం కూడా చేయొద్దు.
అన్నిటితో పాటు సరిపడా నిద్ర, తగినంత నీరుతో పాటు ప్రకృతిలో దొరికే ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు అయితే మీ చర్మం నిత్య యవ్వనంతో మెరిసిపోతుంది.





Untitled Document
Advertisements