నాన్ వెజ్ ప్రియుల కొరకు వెరైటీ పానీ పూరీ !

     Written by : smtv Desk | Fri, Jun 16, 2023, 01:47 PM

నాన్ వెజ్ ప్రియుల కొరకు వెరైటీ పానీ పూరీ !

ఆహరప్రియులు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉండే వాటిలో పానీపూరీ ఒకటి. రోడ్డు పక్కనున్న బండ్ల దగ్గర లొట్టలేసుకుంటూ అందరూ పానీపూరీని లాగించేస్తుంటారు. తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ సరికొత్త పానీపూరీని ఆవిష్కరించాడు. నాన్ వెజ్ పానీపూరీని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో చికెన్ పానీపూరీ, మటన్ పానీ పూరీ, రొయ్యల పానీపూరీ, వేట్కీ ఫిష్ పానీపూరీ వెరైటీలు ఉన్నాయి. దీని మెనూకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సరికొత్త పానీపూరీలపై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. వాట్ ఏన్ ఐడియా సర్జీ అంటూ పలువురు ఆహారప్రియులు ప్రశంసిస్తున్నారు. మరి ఈ సరికొత్త పానీ పూరీ ఫుడ్ లవర్స్ ని ఏ మాత్రం కట్టిపడేస్తుంది అనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements