అండర్ ఆర్మ్స్ షేవ్ చేసిన తరువాత ఇలా చేస్తే నలుపుదనం మాయం !

     Written by : smtv Desk | Mon, Jun 19, 2023, 04:06 PM

అండర్ ఆర్మ్స్ షేవ్ చేసిన తరువాత ఇలా చేస్తే నలుపుదనం మాయం !

ప్రస్తుత కాలంలో ఆధునిక యువతీ వస్త్రధారణలో అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తువులు ధరించేవారు. చీర, లంగా వోణీలు, పరికిణీలు ఆ తరువాత క్రమంగా వాటితో పాటు చుడిదార్లు వచ్చాయి. క్రమక్రమంగా లేగ్గిన్ టాప్స్, జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ ఫ్రాక్స్ ఇలా చాల రకాల కొత్త రకం దుస్తువులను ధరించడానికి నేటీ తరం వారు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్లీవ్ లెస్ టాప్స్ ధరించాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి.. కానీ అలంటి టాప్స్ ధరించాలి అంటే డార్క్ అండర్ ఆర్మ్స్ వలన మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది.. అలంటి టాప్స్ ధరించి బయటకు వెళ్ళిన కుడా నలుగురిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కంఫర్ట్ ఉండలేము..కానీ మీరు ఇకమీదట ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లీవ్ లెస్ టాప్స్ ధరించి హ్యాపీ గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలా అంటారా? సింపుల్ అండి దానికోసం మీరు ఇక్కడ ఉన్న చిన్న చిట్కలను పాటించండి. వీటిని గనుక మీరు ఫాలో అయితే మీకు ఉన్న సమస్య నుంచి విముక్తి పొందుతారు. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

కలబంద : కలబందని మనం ఎన్నో వాటికి ఉపయోగిస్తుంటాం. ఆరోగ్యానికి అందానికి కూడా కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని అందంగా మార్చడానికి కలబంద హెల్ప్ చేస్తుంది. పైగా ఈ సమస్య నుండి ఇది బయట పడేస్తుంది. దీని కోసం మీరు ఒక కలబంద మట్ట తీసుకునే తొక్క తీసేసి గుజ్జుని తీసుకోవాలి. దానిని అండర్ ఆర్మ్స్ కి అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఈ పద్ధతిని మీరు రిపీట్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మార్పును మీరు గమనించ వచ్చు.
లైటనింగ్ క్రీమ్స్ : చాలా మందికి షేవ్ చేసిన తర్వాత క్రీమ్స్ వంటివి రాయరు. అయితే దీనివల్ల కూడా చర్మం నల్లగా మారిపోతుంది. అందుకనే షేవ్ చేసినప్పుడు లైటనింగ్ క్రీమ్స్ రాయండి. కోజిక్ యాసిడ్ లాంటి వాటిని రాయడం వల్ల చర్మం బాగుంటుంది. అలానే స్కిన్ టోన్ మారిపోకుండా ఉంటుంది.
లేసర్ ట్రీట్మెంట్ : లేసర్ ట్రీట్మెంట్స్‌ని తీసుకోవచ్చు. వీటి వల్ల ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతులను ఉపయోగించి కూడా ఈ సమస్యకి గుడ్ బై చెప్పేయచ్చు. దీనితో అండర్ ఆర్మ్స్ నల్లగా అయ్యిపోవడం లాంటి ఇబ్బందులేమీ వుండవు.





Untitled Document
Advertisements