బొప్పాయితో ఎర్రని మృదువైన పెదవులు మీ సొంతం !

     Written by : smtv Desk | Fri, Jul 07, 2023, 08:54 AM

బొప్పాయితో ఎర్రని మృదువైన పెదవులు మీ సొంతం !

మన ముఖ సౌందర్యంలో పెదవులకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దుగారే మోముకి కనుబొమ్మలు దిద్ది, కనులకు కాటుక రాసి, గుండ్రటి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన మీ అలంకారం పూర్తైనట్టు కాదు. పెదవుల పై కూడా కాస్త శ్రద్ధ చూపించాలి అనే విషయం గుర్తించాలి. పెదవుల విషయంలో కూడా సరైన శ్రద్ధ చూపినప్పుడే మీ అలంకరణ పూర్తై ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. నిజానికి మనం అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో పెదవుల పాత్ర ఎక్కువే. చిన్న చిరునవ్వుతో వేల మనసులు గెలవచ్చు అంటారు. మరి ఆ చిరునవ్వు కొరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరేగా. ప్రస్తుత కాలంలో కాలాలతో సంబంధం లేకుండా వాతావరణ కాలుష్యం కారణంగా పెదవులు నిర్జీవంగా మారుతున్నాయి. నల్గురిలోకి పగిలిన, ఎండిపోయిన పెదవులతో వెళ్ళడం సిగ్గుగా, చికాకుగా ఉంటుంది. పెదవులు ఇలా సడలిపోవటానికి కారణం తేమ తగ్గటమే. శరీరంలో ఇతర భాగాలలో చర్మం తేమను కోల్పోతే, మాయిశ్చరైజర్, కోల్టు క్రీము, పెదవులకి బామ్ తప్పనిసరి రాయాలి. ముఖ్యంగా చలికాలంలో పెదవులు చాలా నష్టానికి గురౌతాయి. పగిలి, వడిలి, ఎండిపోయి రక్తం వస్తుంది. ఒక్కోసారి పుండ్లు పడతాయి. అందుకే పెదవులు సంరక్షణ తప్పక ఇంట్లో చేసుకోవాలి.
* పెదవులు తేమగా ఉండాలంటే ప్రతిరోజు 6-7 లీటర్ల నీరు విధిగాత్రాగాలి.
* తాజా కూరగాయలు, పళ్ళు తప్పకుండా తీసుకోవాలి.
* పగిలిన పెదవులకు పెట్రోలియమ్ చేసిన లిప్ బామ్ వాడటం కంటే సహజ ఉత్పత్తులను వాడటం మంచిది.
* ఎండలోకి వెళ్ళే ముందు బాగా పగిలిన పెదవులకు కర్పూరం, పచ్చకర్పూరంతో చేసిన లిప్ బామ్ మాత్రమే వాడితే త్వరగా పగుళ్ళు మాని సున్నితంగా తయారు అవుతాయి.
* పొడిబారిన పెదవుల పై బొప్పాయి పండు గుజ్జును ఇరవై నిమిషాలు. ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి. గులాబీ రేకుల్ని నూరి, పెదవులకు పట్టించండి. దీనివల్ల సున్నితంగానూ,చక్కటి రంగు వస్తుంది.
* రాత్రి పడుకునే ముందు బీట్ రూట్ రసం రాసుకుంటే అందంగా మారుతుంది.
* లిప్స్టిక్ వేసుకునే ముందు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
* డ్రై లిప్ ఉన్నవారు లిప్ స్టిక్ రాసుకునే ముందు లిబ్బామ్ రాసుకోవడం మర్చిపోకూడదు.
* పెదాలు పగిలితే రెండు చుక్కల గ్లిసరిన్లో రోస్ వాటర్ కలిపి రాయండి.
* ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె, గ్లిజరిన్ సమపాళ్ళల్లో కలిపి, వారానికి 3-4 సార్లు రాస్తుంటే, పెదవులు నలుపు తగ్గుతుంది.
* పెదాలకు పేరినెయ్యిగానీ బాదంనూనెగానీ రాస్తుంటే పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* పగిలిన పెదాలకు వాజిలైన్ వాడినా మంచిదే.





Untitled Document
Advertisements