ఎయిర్ లైన్స్ కోసం ఉన్నదంతా పోగొట్టుకున్న విజయ్ మాల్యా.. పోగొట్టుకుంది అంతా బంగారమే

     Written by : smtv Desk | Mon, Aug 07, 2023, 01:39 PM

ఎయిర్ లైన్స్ కోసం ఉన్నదంతా పోగొట్టుకున్న విజయ్ మాల్యా.. పోగొట్టుకుంది అంతా బంగారమే

మన తలరాతను ఎదిరించడం ఎవరితరం కాదు. అదే విధంగా డాన్ని ఊహించడం కూడా అయ్యే పనికాదు. ఇందుకు నిరద్శంగా మన కళ్ళ ఎదుట ఎన్నో గాధలు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఒకటి భారత లిక్కర్ (ఆల్కహాల్/మద్యం) పరిశ్రమ దిగ్గజంగా చెప్పుకునే విజయ్ మాల్యా గురించి తెలిసే ఉంటుంది. యూబీ గ్రూపు సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరించి, దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మాల్యా ఎయిర్ లైన్స్ పరిశ్రమలోకి అడుగు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నారు.

ఎయిర్ లైన్స్ స్థాపించడమే మాల్యా చేసిన అతి పెద్ద తప్పు అని మరో ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారీగా అప్పుల్లోకి కూరుకుపోవడంతో యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీలను డియాజియో గ్రూప్ నకు మాల్యా విక్రయించుకోవాల్సి వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించకుండా ఆయన విదేశానికి చెక్కేశారు.
మాల్యా విక్రయించిన యూబీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ నేడు రూ.1.15 లక్షల కోట్లు. వీటిని అమ్ముకోకుండా ఉంటే మాల్యా నేడు రూ.లక్ష కోట్లకు అధిపతిగా కొనసాగే వారు. కానీ విధి ఆయన్ని వెంటాడింది. అంతేకాదు 1990లో విజయ్ మాల్యా యూబీ గ్రూపు నుంచి అమ్మేసుకున్న చిన్న పెయింట్స్ కంపెనీ నేడు ఆ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అదే బెర్జర్ పెయింట్స్.

పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన కులదీప్ సింగ్ దింగ్రా, గుర్బచన్ సింగ్ దింగ్రా సోదరులు మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ నుంచి బెర్జర్ పెయింట్స్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసే నాటికి అది చాలా చిన్న కంపెనీగా ఉంది. కానీ నేడు అదే కంపెనీ మార్కెట్ విలువ రూ.68,000 కోట్లు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే అందుకు ఒక నిదర్శనం విజయ్ మాల్యా అని చెప్పుకోవాలి.





Untitled Document
Advertisements