విటమిన్ డి లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందా ?

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 04:04 PM

విటమిన్ డి లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందా ?

ప్రస్తుతకాలంలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇందుకు గల ముఖ్య కారణం ఎండ సోకకుండా గంటల తరబడి నీడ పట్టున్న ఉండడమే. మనం అసలు ఎండ అనేది ఒంటికి తగలకుండా ఉండడం వలన విటమిన్ డి లోపం వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల చాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతకాలంగా విటమిన్ డి లోపం అనేది భారత్‌లో అతిపెద్ద సమస్యగా మారింది
3 సంవత్సరాల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో ఏకంగా 76 శాతం ప్రజలు డి విటమిన్ లోపంతో సఫర్ అవుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మహిళల్లో ఈ లోపం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నారు. ప్రధానంగా పైసా ఖర్చు లేకుండా సూర్యరశ్మిలో విటమిన్-డి లభిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. .
అయితే సూర్యరశ్మి ఎంత మొత్తంలో సరైనది.. దానికి ఎంత సమయం పట్టవచ్చు అనేది అతిపెద్ద ప్రశ్న. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి.. ఏ సమయంలో శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

తెల్లవారుజామునే వచ్చే లేలేత సూర్య కిరణాల నుంచి అత్యధిక డి విటమిన్ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలానే సాయంత్రం పొద్దుకూకే సమయంలో ఎండ కూడా మంచిదట. శరీరాన్ని బట్టి ఒక్కొక్కరి ఒక్కోలా సూర్యరశ్మి అవసరం ఉంటుంది. ఎండలో ఉన్నప్పుడు ప్రధానంగా మోచేతులు, ముఖానికి నేరుగా ఎండ తగిలేలా చూసుకోవడం మర్చిపోకూడదు.అప్పుడే మనకు కావలసిన విటమిన్ డి లభిస్తుంది.

ప్రతిరోజూ 10 నుండి 30 నిమిషాలు సూర్యరశ్మికి గురికావడం అనువైన సమయమని వైద్యులు తెలుపుతున్నారు .
ఎందుకంటే సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత బి (UVB) రేడియేషన్ చర్మంలో విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. సూర్యుని నుండి UVB రేడియేషన్ మొత్తం ఈ సమయంలో ఎక్కువగా ఉన్నందున ఇది ఉదయం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

విటమిన్ డి లోపిస్తే వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో పాటు ఇది శరీరంలోని డోపమైన్ స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. మీరు విటమిన్ డి లోపంతో బాధపడకుండా ఉండాలంటే.. సూర్యుడి నుంచి వచ్చే ఎండ మీ శరీరానికి తాకనివ్వాలి.విటమిన్ డి యొక్క ప్రధాన మూలం సూర్యకాంతి. మీరు సూర్యరశ్మికి గురైనప్పుడు, మీ చర్మం రంగు మారుతుంది. ఈ కాంతి విటమిన్ డికి మూలంగా మారుతుంది. విటమిన్ డి ఉత్పత్తి శిశువులు, పిల్లలు, పెద్దలకు ఒకే విధంగా ఉంటుంది.
కానీ, రక్షణ లేకుండా ఎక్కువ కాలం సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్లు కారణం కావచ్చు. ఈ ఒత్తిడి, వలన సన్ ఇన్ఫెక్షన్లు మరియు చర్మ క్యాన్సర్ వంటి నష్టం కూడా ఉంటుంది . అందువల్ల, ఎండలో గడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.





Untitled Document
Advertisements