ఈ టిప్స్ ఫాలో అయితే 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోవడం కాయం

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 11:30 AM

ఈ టిప్స్ ఫాలో అయితే  7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోవడం కాయం

ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు పార్లర్‌కి పేస్ కేర్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు అని భాధ పడుతుంటారు. అలాంటప్పుడు మన ఇంట్లోనే లభించే శెనగపిండిలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసి సరైన విధానం, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

టొమాటో రసం-శెనగపిండి ప్యాక్:
ఎర్రగా నిగనిగలాడే టొమాటో పండ్ల తీసుకొని వాటితో రసం చూసుకోవాలి . ఈ టొమాటో రసంలో 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ ముఖంపై 10 నిమిషాలు అప్లై చేయండి. ఆపై కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, ఇతర యాంటీ ఏజింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. టొమాటో రసం మీ స్కిన్ అందంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న కాసేపటికి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ బ్యాగ్-శెనగపిండి ప్యాక్:
చాల మంది తాగడానికి గ్రీన్ టీ బ్యాగ్‌ని తెచ్చుకుంటారు కొన్ని రోజుల తర్వాత వాటిని వాడరు . ఆ గ్రీన్ టీ బ్యాగ్‌ని వేడి నీళ్లలో నానబెట్టి, చల్లారగానే శెనగపిండిని వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 15 నిమిషాలు పట్టించి, ఆపై నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని అందంగా మారేందుకు సాయపడుతుంది.

నిమ్మరసం - శెనగపిండి ప్యాక్:
2 టేబుల్ స్పూన్ల శెనగపిండి, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, పెరుగు అవసరాన్ని బట్టి తీసుకోండి. వాటిని బాగా కలపండి. మీ ముఖానికి 20 నిమిషాల పాటు ప్యాక్ వేయండి. కడిగిన తర్వాత, మాయిశ్చరైజర్ రాయండి. ఈ ప్యాక్ డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దేని వలన మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

పైన చెప్పిన చిట్కాలను వారం రోజులు పాటిస్తే చాలు మీ ముఖం మెరిసిపోతుంది. కాంతివంతంగా తయారవుతుంది. శెనగపిండి మీ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. దీనితో మీరు అందంగా కనిపిస్తారు. చాలా మంది ముఖం అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే పదార్థాలను ఉపయోగిస్తారు. దీనితో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మెుటిమలతోపాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. మార్కెట్లో దొరికే వాటిలో ఎక్కువ గా కెమికల్స్ ఉంటాయి . దేని వలన ముఖం అందహీనంగా తాయారు అవుతుంది . కావున సహజ పదార్థాలను ఉపయాగించి చేసే ఈ పేస్ ప్యాక్ ను మీ ముఖానికి ఉపయోగిస్తే మంచిది.





Untitled Document
Advertisements