కడుపు ఖాళీ చేస్తే అద్భుతమైన జ్యూస్.. రోజుకొక్క గ్లాస్ చాలు

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 11:53 AM

కడుపు ఖాళీ చేస్తే అద్భుతమైన జ్యూస్.. రోజుకొక్క గ్లాస్ చాలు

ఉసిరిలో విటమిన్ సి కంటెంట్‌ అధిక మొత్తంలో ఉంటుంది. వివిధ సిట్రస్ జాతి పండ్లలో కంటే ఇందులో ఎక్కువగా ఉండటం గమనార్హం. ఉసిరి పోషకాల గని. ఇండియన్ గూస్‌బెర్రీ‌గా పిలిచేది ఉసిరికాయ మాత్రమే .ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు. విటమిన్ సి అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. దీనిలో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు ఉంటాయి.ఇది కాస్త చేదు, వగరుగా ఉండీ , ఆస్ట్రిజెంట్, ఘాటైన పులుపు, తీపి వంటి రుచుల కలయికతో ఉంటుంది. ఉసిరి జ్యూస్‌ను పరగడుపున తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఉసిరి జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని విడుదల చేయడానికి సహాయపడుతుంది . దీని ఫలితంగా జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తాగితే ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి సాధారణ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి రక్తంలో షుగర్ లెవల్స్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది . ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో కీలకమైన డిటాక్సిఫికేషన్ లక్షణాలు ఉసిరిలో సమృద్ధిగా ఉంటాయి. ఉసిరి జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగితే పేగు కదలికలతో టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా ఇది నియంత్రిస్తుంది.
ఉసిరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర కణాలు, అవయవాల్లో వాపును తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థరైటిస్ లేదా ఇతర ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్ బారిన పడినవారు ఉసిరి జ్యూస్ పొద్దున్నే తాగితే ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండే ఉసిరి కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. దీంతో చర్మం సహజత్వం సంతరించుకుంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలను నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నియంత్రిస్తుంది. కానీ ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్న ఈ ఉసిరి మనకు అన్ని కాలలో లభించదు . కాబట్టి ఉన్నప్పుడు దానిని వాడుకోవాలి .





Untitled Document
Advertisements