పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం పోస్టాఫీస్‌‌ స్కీమ్..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 12:35 PM

పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం పోస్టాఫీస్‌‌ స్కీమ్..

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినతర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఆడపిల్లల కోసం , సీనియర్ సిటిజెన్ కోసం ఎన్నో పథకాలను తీసుకొని వచ్చారు . చాల మందికి వీటి గురించి తెలియక కష్టపడి సంపాదించిన డబ్బులు వడ్డీకి ఆశ పడి వడ్డీ వ్యాపారం చేస్తూఉంటారు కొన్ని సార్లు ఆలా మొత్తాన్ని పోగొట్టుకున్నవారు ఉన్నారు . అందువలన ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదించిన దానిలో కొంతమొత్తాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి. అది భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని దూరం చేస్తుంది. అయితే, ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. పెట్టుబడికి భద్రత, స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలని భావించే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత నెల వారీ ఖర్చుల కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 5 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే ఐదు సంవత్సరాల పాటు నెల నెలా స్థిరమైన రాబడి అందుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. ఈ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో అకౌంట్ ఎవరైనా తెరవొచ్చు. గరిష్ఠంగా ముగ్గురితో జాయింట్ ఖాతా కూడా తీసుకోవచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ ఖాతా తెరవచ్చు.


ఈ పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. సింగిల్ అకౌంట్ అయితే, గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతా అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మెచ్యూరిటీ పూర్తయ్యే సరికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ స్కీమ్ కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంఐఎస్ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ప్రీ మెచ్యూర్ చేస్తే వడ్డీ రేటులో కోత పడుతుంది.


మీరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా నెలకు రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే ఈ అకౌంట్లో రూ.9 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 7.4 శాతం వడ్డీ రేటుతో మీ బ్యాంకు ఖాతాలోకి ప్రతి నెలా రూ.5,550 వచ్చి చేరతాయి. అలాగే మీరు జాయింట్ ఖాతా తెరిచి రూ.15 లక్షలు గనక డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతి నెలా వడ్డీ రూపంలో రూ.9,250 వస్తాయి. మీ నెలవారీ ఖర్చుకు తగినంత ఆదాయం ఉండాలని కోరుకునే వారు, దానికి తగినట్లుగానే పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడి ఆధారంగానే మీకు నెల నెలా వచ్చే ఆదాయం ఆదారపడి ఉంటుంది.ఈ విధంగా సేవ్ చేయడం వలన భవిష్యత్ లో ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం ఉండదు .
మనకు నెల నెల కు వచ్చే దానితో సంతోషంగా ఉండవచ్చు .






Untitled Document
Advertisements