రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ పండు బెస్ట్..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 12:47 PM

రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ పండు బెస్ట్..

చాలామందికి ఫ్రూప్ట్స్ అన్ని తినడానికి ఇస్టపడరు. ముఖ్యంగా పుల్లగా ఉండే బ్లాక్ గ్రేప్స్ తినాలి అంటే అసలు ఇష్టం ఉండదు . కానీ నల్లద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్ష్, ఆంథోసైనిన్స్ వంటి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుతుంది.నల్లద్రాక్షలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది పుల్లగా ఉంటుంది . ఇది ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. అదేవిధంగా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, బోలు ఎముకల సమస్య రాకుండా చేస్తుంది.
ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకూ క్యాన్సర్ తగ్గుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిది. అదే విధంగా, నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి.వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. దీంతో కేలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు తాగాలి అనుకునే వారు దీంతో బరువు తగ్గుతారు.
నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తినడం మంచిది. నల్లద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిది. అందరికీ అందుబాటులోనే ఉండే ఈ పండ్లు తినడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది.







Untitled Document
Advertisements