అరుదైన ఘనత సాధించిన మహిళా మ్యూజిషియన్‌..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 03:14 PM

అరుదైన ఘనత సాధించిన మహిళా మ్యూజిషియన్‌..

పాప్‌ స్టార్‌ రిహన్నా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన మహిళా మ్యూజిషియన్‌గా అవతరించింది ప్రపంచ పాపులర్ పాప్ సింగర్ రిహన్నా.. ఇండియాలో సందడి చేస్తొంది. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ గుజ‌రాత్- జామ్ న‌గ‌ర్‌లో జామ్ జామ్ అంటూ ఆకర్షణీయంగా జరిగాయి. ఈ వేదిక‌కు ప‌లు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. అయితే మూడు రోజుల ఉత్సవంలో అందరి దృష్టి ప్ర‌పంచ‌ పాప్ దిగ్గ‌జం, గాయని రిహన్నాపైనే నిలిచింది.
రిహాన్న అహూతుల‌ను త‌న గానాలాప‌న డ్యాన్సింగ్ ఎబిలిటీతో ఉర్రూత‌లూగించింది. ముంబై సెల‌బ్రిటీలంతా రిహాన్న‌తో క‌లిసి డ్యాన్సులు చేసారు. ఆ వేదిక‌పై అంబానీలు, న‌వ‌దంప‌తులు కూడా రిహాన్న‌తో స్టెప్పు క‌లిపారు. పార్టీలో రిహాన్న‌తో సమయాన్ని గడిపిన వీడియోలు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. రిహానా 8 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రదర్శన ఇవ్వడం మొత్తం 19 పాటలతో అతిథులను అలరించడం ప్రత్యేక‌మైన మూవ్ మెంట్ గా మారింది . అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో క‌లిసి రిహాన్న‌ ఆకస్మిక నృత్య ప్రదర్శన అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ధడక్ చిత్రం నుండి జింగాత్ బీట్ కు ఇద్దరూ క‌లిసి స్టెప్పులేసిన వీడియో వైరల్ గా మారింది . జాన్వీ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకుంటూ స‌ర‌దాగా గ‌డిపిన క్లిప్ కూడా వైర‌ల్ అయింది. వారి చాటింగ్ గురించి అభిమానులు ఆసక్తిని క‌న‌బ‌రిచారు. ఇటీవల, స్క్రీన్ & స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ 2024లో జాన్వి ఇదే విష‌య‌మై ముచ్చ‌టించింది. రిహన్న తో చాలా ఎక్కువసేపు ముచ్చ‌టించే అవ‌కాశం త‌న‌కు క‌లిగింద‌ని జాన్వీ తెలిపింది.
అవార్డ్స్ నైట్ కోసం జాన్వీ కపూర్ గోల్డెన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. తన అవార్డును స్వీకరించడానికి వేదికపైకి పిలిచినప్పుడు జాన్వి అప్ర‌య‌త్నంగా అంబానీల ప్రీపెళ్లిలో రిహన్నతో తన సంభాషణలను గుర్తుచేసుకుంది. మునుపటి ఈవెంట్‌లో జాన్వీ కపూర్ రిహన్నాపై ప్రశంసలు కురిపించింది. పాప్ గాయ‌నిని దేవత అని పొగిడేసింది. అదే సమయంలో రిహానా మంచిత‌నం, వెంట‌నే చేరువయ్యే వ్యక్తిత్వాన్ని కూడా హైలైట్ చేసింది. నిజానికి రిహన్నాకి ఎవరు అభిమాని కాదు? కాబట్టి ఇది నాకు క‌చ్చితంగా అరుదైన‌ క్షణం. కానీ అన్నింటికంటే ఆమె చాలా వామ్‌గా ప్రేమ‌గా ఉంటుంది. రిహానా చాలా సాధారణమైనది. చాలా కూల్ ప‌ర్స‌నాలిటీ.
తనను చుసిన వెంటనే నాలో పేలుడు సంభవించింది
జాన్వీతో కలిసి డ్యాన్స్ చేయ‌డ‌మే కాదు.షారుఖ్ ఖాన్ జవాన్‌లోని చలేయా పాటకు కూడా రిహాన్న‌ డ్యాన్స్ చేసింది. ఇంటర్నెట్ సంచలనం ఓరీతో కూడా రిహాన్న ఫోజులిచ్చింది. ఈవెంట్ ప్ర‌ధాన హోస్ట్‌లు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌లతో కలిసి గ్లోబల్ సూపర్ స్టార్ రిహాన్న‌ పోజులివ్వడంతో వేడుకలు కొత్త ఎత్తులకు చేర్చాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీ కపూర్ తదుపరి జూనియర్ ఎన్టీఆర్ `దేవర`లో కనిపిస్తుంది. ఆ తర్వాత రాజ్‌కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహిలో క‌నిపిస్తుంది. ఉలాజ్ అనే చిత్రంలోను న‌టిస్తోంది. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపికైంది. దీన్ని బట్టి చూస్తే జాన్వీ వరసగా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది .





Untitled Document
Advertisements