రెండు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:15 PM

రెండు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

తెలంగాణాలో రెండు రోజుల పాటు ఒక మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవన శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని ,పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని.. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రేపు ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.






Untitled Document
Advertisements