లోఫర్‌ హీరోయిన్ దిశకు అదృష్టం తెచ్చిపెట్టిన రెండవ చిత్రం

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 04:31 PM

 లోఫర్‌ హీరోయిన్  దిశకు  అదృష్టం తెచ్చిపెట్టిన రెండవ చిత్రం

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో పుట్టిన దిశ అమినిటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. గ్లామర్‌ ప్రపంచం మీద ఉన్న ఆసక్తితో అందాల పోటీల్లో పాల్గొంది. హీరో టైగర్‌ షరా్‌ఫతో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోలో నటించిన దిశ . తెలుగులో లోఫర్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ.ఈ అమ్మడు మొదటి సినిమాతో నిరాశ పరిచిన కూడా అదృష్టం బాగుండి హిందీ ఎంఎస్ ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో నటనకు గాను మంచి మార్కులు పడటంతో పాటు కమర్షియల్‌ హిట్‌ దక్కించుకుంది.

ధోనీ సినిమా తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా దిశా పటానీ నిలిచింది. అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియా లో రోజు రోజుకు ఫాలోయింగ్‌ లో స్టార్‌ డం తో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసింది. అయితే ఈసారి కాస్త విభిన్నమైన మేకోవర్‌ ను ట్రై చేసింది. అంతే కాకుండా డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ తో చూపు తిప్పుకోనివ్వనంత అందంగా కనిపిస్తోంది. అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు ఈసారి అంతకు మించి అన్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో కల్కి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా బాలీవుడ్‌ లో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తెలుగు లో సినిమా చేయడంతో ఆమె సౌత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రభా్‌సతో, మరొకటి తమిళ హీరో సూర్యాతో నటిస్తోంది. ఈ రెండూ భారీ బడ్జెట్‌ సినిమాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఆమెకు ఫాలోయింగ్‌ కూడా తక్కువేం లేదు.





Untitled Document
Advertisements