కొబ్బరి పీచుతో ఇలా చేస్తే జుట్టుకు డై వేసే పనిలేకుండా నల్లగా మారుతుందట!

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 08:15 AM

కొబ్బరి పీచుతో ఇలా చేస్తే జుట్టుకు డై వేసే పనిలేకుండా నల్లగా మారుతుందట!

ఎండాకాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . మండే ఎండల వల్ల డీహైడ్రేషన్‌, అలసట, తలనొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.. వేసవి తాపం తట్టుకోవడానికి.. బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌.. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌, ఎండ వేడిని తగ్గించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అందరికీ తెలిసిందే. అలాగే, కొబ్బరి రుచి ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి గుజ్జును అనేక వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదే సమయంలో కొబ్బరి పాలు, నీరు చర్మానికి మెరుపును తీసుకురావడానికి సహాయపడతాయి . మనం కొబ్బరి నీళ్లు వాడుతాం.. కొబ్బరి గుజ్జును తింటాం కానీ, దాని పొట్టును పడేస్తాం కానీ దాని వలన . అయితే, ఈ పొట్టు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి పీచుతో తాడును అల్లుతుంటారు. మీరు మీ తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి కొబ్బరి పొట్టును ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును తక్షణమే నల్లగా కనిపించేలా చేస్తుంది. దీనికి మీకు ఎలాంటి రంగు అవసరం లేదు. కొబ్బరి పీచుతో జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం

కొబ్బరిపీచుతో తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ముందుగా ఒక ఇనుప కడాయిలో కొబ్బరి పీచును వేసి బాగా ప్రై చేసుకోవాలి. అది నల్లగా మారిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పొడి చేసుకోవాలి. అనంతరం ఆ పొడిలో కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె, లేదంటే బాదం నూనెను కలుపుకుని మొత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని డైలా జుట్టుకు అప్లై చేసి సుమారు అరగంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుందట. అంతేకాదు.. దీని ద్వారా మీ జుట్టుకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు .


కొబ్బరి పీల్ ఇతర ప్రయోజనాలు:
1 మీ పసుపు దంతాలను తిరిగి మిలమిల మెరిపించడానికి ఈ కొబ్బరి పీచు ఎంతో సహాయపడుతుంది.
2 విరేచనాలు, జీర్ణక్రియ సమస్యలకు కొబ్బరి పీచు దివ్య ఔషధంలా పనిచేస్తుందట.
3 కొబ్బరి పొట్టు రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది.
4 పైల్స్ సమస్యల నుండి బయటపడటానికి కొబ్బరి తొక్క ప్రయోజనకరంగా ఉంటుంది
5 కొబ్బరి పీచుతో వంట పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు.
6 పూర్వకాలం లో బొగ్గుపొడి, నిమ్మరసం కలిపి కొబ్బరి పీచుతో వంట గిన్నెలు శుభ్రం చేసుకునే వారు .

కొబ్బరి కాయనే జాగ్రత్తగా చూసుకుంటాం కదా మనకు తెలియకుండానే పడవేసే కొబ్బరి పీచుతో ఇ న్ని రకాలైన ప్రయోజనాలను పొందవచ్చును . కావున ఇప్పుడు కొబ్బరి పీచును కూడా చాల జాగ్రత్తగా ఉంచుకోవాలి .





Untitled Document
Advertisements