జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా ?. చాలా డేంజర్!

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 08:52 AM

జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా ?. చాలా డేంజర్!

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినతర్వాత మన జీవితమే మారి పోయింది అనుకోవాలి . ఇప్పుడు ఇది లేకుండా గడపడం చాల కష్టం . మనము బయటికి వెళ్ళినప్పుడు ఫోన్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటాం. అయితే కొంతమంది మహిళలు మాత్రం ఫోన్‌ని బ్యాగుల్లో, ట్రౌజర్ జేబుల్లో పెట్టుకుంటారు. రోజంతా ఫోన్‌ను జేబులో పెట్టుకోవడం లేదా శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదు. చాలా మంది తమ ఫోన్లను షర్ట్ జేబుల్లో పెట్టుకుంటారు. ఇది ఎప్పుడూ చేయకూడదు. ఫోన్ విడుదల చేసే రేడియేషన్ నేరుగా శరీరానికి హాని చేస్తుంది. ఫోన్‌ను ప్రత్యేక పద్ధతిలో ఉంచాలి. ఫోన్ డిస్‌ప్లే పైకి ఎదురుగా ఉండాలి.అంతేకాకుండా ఫోన్‌ని ఎప్పుడూ ప్యాంట్‌ వెనుక జేబులో ఉంచుకోవడం మంచిది. అయితే అందరూ ఫోన్‌ని ముందు జేబులో పెట్టుకుంటారు. కానీ అలా చేయకండి. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే రేడియేషన్ ముందు జేబులో ఉంచినప్పుడు DNA నిర్మాణాన్ని మార్చగలదు, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.కాబట్టి మీరు దానిని మీ ప్యాంట్ జేబులో ఉంచుకోవాలనుకుంటే, మీ ఫోన్‌ను వీలైనంత వరకు మీ వెనుక జేబులో ఉంచండి. అయితే వెనుక ఫోన్ పెట్టుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, దొంగల సమస్య తలెత్తవచ్చు. అలాగే చొక్కా జేబులో పెట్టుకుంటే గుండెకు సంబంధిచిన సమస్యలు వస్తాయి. కాబట్టి మొబైల్ ఫోన్లను వీలైనంత ఎక్కువ బ్యాగుల్లో ఉంచుకోవడం అలవాటు చేసుకోండి.కానీ చాలా మందికి జేబుల్లో పెట్టుకోని వెళ్లడం వలన ఆ స్మార్ట్‌ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ మన శరీరానికి హానికరం చేస్తుంది . కాబట్టి మనకు వీలైనంత వరకు దీనిని దూరంగా పెట్టుకోవడం మంచిది . ఈ మద్య కాలంలో పిల్లలకు ఎక్కువగా ఇస్తున్నారు ఇది కూడా చాల డేంజర్ కావున వీరికి కూడా దీన్ని దూరంగా ఉంచండి





Untitled Document
Advertisements