మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది.. త్రిష

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 03:20 PM

మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది.. త్రిష

టాలీవుడ్ లో అనేక మంది అగ్రహీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష.. కొద్దికాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొన్నియన్ సెల్వన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తరగని అందంతో సినీ ప్రియులను కట్టిపడేస్తోంది. పాన్ ఇండియా మూవీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తోంది. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీలో నటిస్తోంది. అంజి మూవీ తర్వాత చిరు మరోసారి సోషియో ఫాంటసీ జోనర్ లో సినిమా చేస్తుండటంతో అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా కోనసాగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో త్రిష పాల్గొంటోంది.

మన్మధుడి ముద్దుగుమ్మ తాజాగా త్రిష సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మెగాస్టార్, ఆస్కార్ స్టార్ కీరవాణితో దిగిన పిక్ ను షేర్ చేసింది. ఒక గొప్ప భక్తిమయమైన ఉదయమంటూ క్యాప్షన్ ఇచ్చింది. త్రిష షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పిక్స్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈరోజు ఉదయం కీరవాణి దగ్గరకు చిరంజీవి, త్రిష వెళ్లి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారట. ఈ పిక్స్ అప్పుడే దిగారని తెలుస్తోంది.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష.. ఇటీవల మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- గోట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. యంగ్‌ విజయ్‌ కు సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. తండ్రి పాత్రకు జోడీగా త్రిష యాక్ట్ చేస్తోంది . అయితే ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను ముందు అనుకున్నారు . కానీ ఆ పాత్రకు స్వీటీ నో చెప్పడంతో త్రిషకు ఈ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దీంతోపాటు త్రిష కమల్‌ హాసన్‌, మణిరత్నం క్రేజీ ప్రాజెక్ట్ థగ్‌ లైఫ్‌, అజిత్‌ విడాముయర్చి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగులో వెంకటేష్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కు కూడా ఆమెనే హీరోయిన్ గా మేకర్స్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఈ సంవత్సరం అంత బిజీగా ఉన్నట్లు తేలుస్తుంది. ఆమె నటనతో ప్రేక్షేకులను అలరిస్తుంది మరి .





Untitled Document
Advertisements