మామ రజినీకాంత్ చిత్రంలో నటిస్తానన్న అల్లుడు ధనుష్

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 03:43 PM

మామ రజినీకాంత్ చిత్రంలో నటిస్తానన్న అల్లుడు ధనుష్

సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు అయినా ధ‌నుష్. అంతేకాకుండా డైరెక్టర్ గా సింగర్ గా , యాక్టర్ గా పేరుతెచ్చుకున్న ధనుష్. ఎట్ట‌కేల‌కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో ఆ లెజెండ‌రీ న‌టుడి బ‌యోపిక్ సాధ్య‌మేనా కాదా అని ఎన్నో ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. అన్నింటికి పుల్ స్టాప్ పెడుతు ధ‌నుష్‌-అరుణ్ మాథేశ్వ‌ర‌న్ కాంబో ముందుకు రావ‌డంతో సాధ్య‌మైంది. ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ ధ‌నుష్ కి వ‌స్తుందా? మ‌రో న‌టుడికి వ‌స్తుందా? అన్న ఎన్నో ర‌కాల సందేహాలు ఉండేవి.కానీ చివరికి ఆ అరుదైన అవ‌కాశం ధ‌నుష్ కి రావ‌డంతో ఆయ‌న ఆనందాన్ని అవ‌దుల్లేవ్. ఈ ప్రాజెక్ట్ ని ధ‌నుష్ ఓ క‌ల‌గా భావించాడు. ఇప్పుడా డ్రీమ్ నెర‌వేరుతుంది. ధ‌నుష్ లో అస‌లైన న‌టుడ్ని మ‌రోసారి తెర‌పై ఆవిష్క‌రించ బోతున్నాడు. అయితే ధ‌నుష్ కి మ‌రో డ్రీమ్ కూడా ఉంది. అత‌ను కూడా ఎప్పుడు ఒకే చెబుతాడా? అని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న‌ట్లు అత‌డి మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. అంటే సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ జీవిత క‌థ‌లో కూడా ఎప్పుడు న‌టిస్తానా? అని ఇప్ప‌టి నుంచి వె యిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు.
ఇళ‌య‌రాజా త‌ర్వాత తాను ర‌జ‌నీ జీవితంలో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపాడు. ఇళ‌య‌రాజా తో పాటు త‌న డ్రీమ్ లో ర‌జ‌నీ కూడా ఉన్నార‌ని అన్నాడు. దీంతో ధ‌నుష్ దృష్టిలో ఇద్ద‌రు చెరో క‌న్ను అని తెలుస్తోంది. కుడి క‌న్ను ఇళ‌యారాజా అయితే ఎడ‌మ క‌న్ను ర‌జ‌నీకాంత్ అని అంటున్నాడు.దీన్ని బట్టి చుస్తే రెండు కళ్ళు ధనుషుకు కావాలి . అంటే ఇప్పుడు ద‌నుష్ రజనీకాంత్ అంగీకారం కోసం కూడా ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ ఛాన్స్ ధ‌నుష్ కే ఇస్తాడా? లేక మ‌రో న‌టుడికి ఉంటుందా? అన్న‌ది ర‌జ‌నీ చేతుల్లోనే ఉంది. అలాగే ఆయ‌న జీవిత క‌థ‌ని ఇప్పుడే చూడాల‌నుకుంటున్నారా? ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల‌ను కుంటున్నారా? అన్న‌ది తెలియ‌ని అంశం. కానీ ధ‌నుష్ మాత్రం ఆ ఛాన్స్ త‌న‌కే రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.ర‌జ‌నీ కాంత్-ధ‌నుష్ ఇద్ద‌రు మాజీ మామ‌-అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. ఐశ్వ‌ర్య‌ర‌జ‌నీకాంత్ - ధ‌నుష్ వివాహం విడిపోయిన సంగ‌తి తెలిసిందే . ఈలాంటి సమయంలో రజనీకాంత్ బయోపిక్ తీస్తే ధనుష్ చేయడానికి ఒప్పుకుంటాడా ? లేదా? వేచి చూడాలి మరి .







Untitled Document
Advertisements