మనిషికి పంది కిడ్నీని అమర్చిన వైద్యులు.. ప్రపంచంలో తొలిసారిగా ప్రయోగం

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 08:11 AM

మనిషికి పంది కిడ్నీని అమర్చిన వైద్యులు.. ప్రపంచంలో తొలిసారిగా ప్రయోగం

మనిషి ఒంట్లోని అవయవాలు పాడైన సందర్భంలో మరొక మనిషి ఎవరైతే బ్రెయిన్ డేడ్ అయ్యి ఉంటారో అటువంటి వారి అవయవాలను అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే అటువంటి అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో మరో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు. సజీవంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి కిడ్నీ అమర్చడం ఇదే తొలిసారని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు గురువారం తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని చెప్పారు. రోగి ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నారని అన్నారు. గతంలో పంది మూత్ర పిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. పంది గుండెలను గతంలో ఇద్దరికి అమర్చగా వారు కొన్ని నెలల వ్యవధిలోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్తి ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.





Untitled Document
Advertisements