పాలకూరతో ఇలా చేస్తే మీ జుట్టు పెరగడం గ్యారెంటీ !

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 12:22 PM

ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా కానీ, టెన్షన్స్ వల్ల కానీ, పని వత్తిడి వలన కానీ, చాల మంది హెయిర్ ప్రాబ్లమ్స్​ను ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు కనీసం జుట్టు ఊడిపోకుండా, ఉన్న జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్​, చిట్కాలు ట్రై చేస్తుంటారు. ఇక కొందరైతే వేలవేలకు ఖర్చు చేసి జుట్టు(Hair) పెరుగుదల కోసం హెయిర్ స్పా వంటి ట్రీట్​మెంట్స్ కూడా తీసుకుంటుంటారు. అయినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాంటి వారు మనము డైలీ తినే ఆహారంలో పాలకూరను వాడమని అంటున్నారు . ఇలా చేయడం వల్ల జుట్టు మందంగా, ఆరోగ్యకరంగా, బలంగా తయారవ్వడం గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ, పాలకూరను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో చూడండి .

మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర మీ వెంట్రుకలకు ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతాయి. అలాగే జుట్టు పెరగడానికి కెరాటిన్‌, కొలాజిన్‌ ఈ రెండూ చాలా అవసరం. విటమిన్‌ బి, సి లు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టు రావడానికీ, వేగంగా పెరగడానికీ చాలా బాగా సహాయపడుతుంది . అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మాడు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. పాలకూరలో పుష్కలంగా ఉండే ఐరన్ వెంట్రుక మొదళ్లకు ఆక్సిజన్‌ అందించి అవి రాలకుండా చూస్తుంది ఇక పాలకూరను హెయిర్ గ్రోత్ కోసం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

స్పినాచ్ హెయిర్ మాస్క్ : మీ జుట్టు పెరుగుదలకు పాలకూర హెయిర్ మాస్క్​ చాలా చక్కగా పనిచేస్తుంది . ఇక దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా కట్​ చేసిన ఒక కప్పు పాలకూర ఆకులు తీసుకొని లైట్​గా వాటర్​ కలుపుకొని ఫ్యూరీలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మీ స్కాల్ప్, హెయిర్​కి అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో హెడ్ బాత్ చేయాలి.

పాలకూర రసం : ఇది కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుంది . ఇప్పుడు దీనిని ఎలా సిద్ధం చేసుకోవాలంటే ముందుగా మిక్సీ జార్​లో ఒక గుప్పెడు కట్​ చేసిన పాలకూర ఆకులను తీసుకొని, కొద్ది మొత్తంలో వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్​లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు అందుతాయి .

పాలకూర, పెరుగు హెయిర్ మాస్క్ : మీ జుట్టు ఒత్తుగా పెరగడంలో ఈ మాస్క్ కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంధీ. ఇక దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు కట్ చేసిన పాలకూర ఆకులను తీసుకొని మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి. ఆపై దానికి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తల, జుట్టుకు అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి.

పైన చూపిన విధంగా పాలకూరను మిగిలిన పదార్థాలను వాడడం వలన మన జుట్టు కు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి . అంతేకాకుండా మనము పార్లర్ల కు వేళ్లి డబ్బులు ఖర్చు చేసుకొని , దాని వలన ఎలాంటి లాభం లేకపోవడం కంటే మన కిచెన్ లో లభించే వాటిని వాడుకోవడం మంచిది. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు .









Untitled Document
Advertisements